మీకు ధైర్యం ఉంటే, ఉప్పు కారం తింటే... అనసూయ సంచలన వీడియో, దేవరకొండ వివాదం మరో లెవెల్ కి!

Published : May 10, 2023, 05:30 PM ISTUpdated : May 10, 2023, 05:39 PM IST

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో అనసూయ గొడవ ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. అనసూయ తాజాగా ఈ వివాదాన్ని ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

PREV
16
మీకు ధైర్యం ఉంటే, ఉప్పు కారం తింటే... అనసూయ సంచలన వీడియో, దేవరకొండ వివాదం మరో లెవెల్ కి!
Anasuya Bharadwaj

హీరో విజయ్ దేవరకొండ పేరు ముందు "The' అని పెట్టడాన్ని అనసూయ తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఖుషి చిత్ర పోస్టర్స్ లో ది విజయ్ దేవరకొండ అని రాసిన నేపథ్యంలో అనసూయ స్పందించారు. పరోక్షంగా సెటైర్స్ వేశారు. దాంతో వివాదం రాజుకుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. ఆంటీ అంటూ సోషల్ మీడియా వేదికగా వేధింపులకు దిగారు. 
 

26
Anasuya Bharadwaj

అనసూయను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఏకి పారేశారంటూ వార్తలు వస్తున్న తరుణంలో... ఆమె ఒక వీడియో బైట్ విడుదల చేశారు. యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్ మీద ఆమె మండిపడ్డారు. సెలబ్రిటీల మీద వార్తలు రాసి కడుపు నింపుకునే మీకు ధైర్యం ఉంటే, ఉప్పు కారం తింటుంటే నిజాలు రాయండి. నేను నిజం మాట్లాడాను . నా అభిప్రాయం తెలియజేశాను. 
 

36
Anasuya Bharadwaj

ఫలానా హీరో ఫ్యాన్స్ అనసూయను వేధించారు, ట్రోల్ చేశారు, వెంటబడ్డారు ఇది కాదు. ఇంకా మీకు దునియా దారి అర్థం కావడం లేదు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. అన్నవాడి నోరే కంపు. చేతకాని వాళ్ళు అదుపు తప్పారు. ఇది మీరు పెట్టాల్సిన థంబ్ నెయిల్. బెటర్ లక్ నెక్స్ట్ టైం, అంటూ వీడియో ఎండ్ చేశారు. 
 

46

అనసూయ ఈ వీడియోలో మీడియా సంస్థలను, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని ఏకిపారేశారు. నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ట్రోల్ చేసి మీ పరువే పోగొట్టుకుంటున్నారని ఆమె పరోక్షంగా చెప్పారు. ఈ వివాదంలో కొందరు విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలవడం విశేషం. డైరెక్టర్ హరీష్ శంకర్ విజయ్ దేవరకొండకు బర్త్ డే విషెష్ తెలియజేస్తూ అనసూయకు చురకలు అంటించారు. 
 

56


అనసూయ-విజయ్ దేవరకొండల వివాదం ఇప్పటిది కాదు. అర్జున్ రెడ్డి చిత్రం నుండి కొనసాగుతుంది. కొన్నాళ్లు అనసూయ విజయ్ దేవరకొండ మీద ఎలాంటి కామెంట్స్ చేయలేదు. లైగర్ ప్లాప్ టాక్ తెచ్చుకోగా అనసూయ పరోక్షంగా ఓ ట్వీట్ చేశారు. అమ్మను తిట్టిన వాళ్లకు ఇలాంటి ఫలితాలే వస్తాయని దేవరకొండను టార్గెట్ చేసింది. 
 

66


దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. అప్పట్లో అనసూయ-విజయ్ ఫ్యాన్స్ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా విజయ్ దేవరకొండ పేరు ముందు ది అని పెట్టడాన్ని ఆమె తప్పుబట్టారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories