నిషా కళ్లతో మత్తెక్కిస్తున్న ఐశ్వర్య రాజేశ్.. బ్లూ డ్రెస్ లో డస్కీ బ్యూటీ అదిరిపోయే ఫోజులు..

First Published | May 10, 2023, 4:59 PM IST

డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) సంప్రదాయ దుస్తుల్లో ఎంత బ్యూటీఫుల్ గా ఉంటుందో తెలిసిందే. తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. 
 

తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో నటించింది చాలా తక్కువ సినిమాలే అయిన తన పెర్ఫామెన్స్ తో ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళంలో వరుస చిత్రాలతో అలరిస్తూ వస్తోంది. 
 

ప్రస్తుతం ఐశ్వర్య రాజేశ్ ‘ఫర్హానా’ (Farhana) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. లేడీ ఓరియెంటెడ్ గా రూపుదిద్దుకున్న చిత్రానికి నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించారు. ఐశ్వర్య ప్రధాన పాత్రలో నటించింది. కాల్ సెంటర్ లో ఉద్యోగిగా అలరించబోతోంది.
 


మే2న ‘ఫర్హనా’చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లతో ఐశ్వర్య రాజేశ్ బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య అదిరిపోయే అవుట్ ఫిట్లలో బ్యూటీఫుల్ లుక్స్ ను సొంతం చేసుకుంటోంది. కుర్రకారును ఆకట్టుకుంటోంది.

తాజాగా ఐశ్వర్య రాజేష్ బ్లూ ఫ్రాక్ లో మెరిసింది. డస్కీ బ్యూటీ అందాన్ని మరింతగా పెంచేలా డ్రెస్ లో దర్శనమిచ్చింది. నిషా కళ్లతోటి కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్లామర్ మెరుపులకు దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ లో హోయలు పోతూ కట్టిపడేస్తోంది.
 

సంప్రదాయ దుస్తుల్లోనే ఐశ్వర్య రాజేశ్ ఎక్కువగా కనిపిస్తుంటారు. వెండితెరపైనా గ్లామర్ షోకు చాలా దూరంగానే ఉంటారు. అందుకే తమిళ బ్యూటీ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సాధించుకుంది. మరోవైపు అభిమానులు కూడా ఐశ్వర్యను సంప్రదాయ దుస్తుల్లోనే చూసేందుకు ఇష్టపడుతుంటారు. 
 

తెలుగులో ‘వరల్డ్ ఫేమస్ లవర్’,‘టచ్ జగదీష్’, ‘రిపబ్లిక్ ’ వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళం, మలయాళ సినిమాలతోనే ఫుల్ బిజీగా ఉంది. ‘ధ్రువ నక్షత్రం’, ‘మోహన్ దాస్’, ‘పులిమడ’, ‘Her’ తదితర చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. 
 

Latest Videos

click me!