నోరు విప్పిన అనసూయ, షాకింగ్ నిజాలు బయట పెట్టిన స్టార్ యాంకర్, జబర్థస్త్ మానేయడానికి అసలు కారణం అదేనట...?

Published : Aug 14, 2022, 09:01 AM IST

దాదాపు పదేళ్లుగా నిర్విరామంగా సాగుతున్న జబర్థస్త్ కామెడీ షో నుంచి వరుసగా... ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. రీసెంట్ గా యాంకర్ అనసూయకూడా జబర్థస్త్ ను వీడారు. అసలు తాను ఎందుకు జబర్థస్త్ ను వీడవలసి వచ్చిందో ఇంత వరకూ చెప్పని అనసూయ .. రీసెంట్ గా నోరు విప్పింది. తను ఎందకు మానేశాను అనే విషయం  వివరంగా చెప్పింది అనసూయ.   

PREV
18
నోరు విప్పిన అనసూయ, షాకింగ్ నిజాలు బయట పెట్టిన స్టార్ యాంకర్, జబర్థస్త్ మానేయడానికి అసలు కారణం అదేనట...?

జబర్థస్త్  కామెడీ షో అంత పాపులర్ అవ్వడంలో అనసూయ పాత్ర ఖచ్చితంగా ఉంది. దాదాపు 9 ఏళ్ళు జబర్థస్త్ కు  యాంకర్ గా.. సక్సెస్ ఫుల్ జర్నీ చేసిన అనసూయ.. రీసెంట్ గా యాంకర్ చైర్ నుంచి తప్పుకున్నారు. అయితే ఆమె ఎందుకు జబర్థస్త్ వదిలేశారు అన్న విషయంలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. వాటిపై  ఎప్పుడూ స్పందించలేదు అనసూయ. ఇక రీసెంట్ గా ఈ విషయంపై  ఫస్ట్ టైమ్ నోరు విప్పారు స్టార్ యాంకర్. 
 

28

జబర్థస్త్ నుంచి చాలా మంది స్టార్స్ బయటకు వెళ్లిపోయారు, నాగబాబు, రోజా, ఆర్పీ, ఆది,అభి, ఇలా చాలా మంది ఈషోను వదిలిపెట్టారు. అంతెందుకు అనసూయ కూడా కొంత కాలం ఈ షోకు దూరంగా ఉన్నారు. అయితే నాగాబాబు, ఆర్పీ లాంటి వారు వెళ్తూ.. వెళ్తూ.. మల్లెమాల పై దుమ్మెత్తిపోశారు. జబర్థస్త్ మేనేజ్ మెంట్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాని అనసూయ మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా జబర్థస్త్ ను వీడారు. 
 

38

ఇక తను జబర్థస్త్ ను ఎందకు వీడాల్సి వచ్చిందో ఫస్ట్ టైమ్ క్లారిటీ ఇచ్చింది అనసూయ ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు పంచుకుంది.  జబర్థస్త్ అంటే నాకు చాలా ఇష్టమైన షో...నామనసుకు దగ్గరగా ఉండే షో..కాని దాన్ని వీడాల్సివచ్చింది. అంతా ఒక ఫ్యామిలీలా ఉండేవారం.  నాకు తెలిసి.. ఈ షోకి దిష్టి తగిలింది. అందుకే ఇలా జరిగిందేమో.. అక్కడ అంతా మంచి వారే ఉన్నారు... దానితో పాటు వివాదాలు కూడా ఉన్నాయి. వాటి గురించి నేను ఆలోచించలేదు. జబర్థస్త్ నుంచి రావడానికి రెండేళ్ళ నుంచి ప్రయత్నిస్తున్నాను అన్నారు అనసూయ. 

48

ఇక నన్ను నేను నిరూపించుకోవడం కోసమే జబర్థస్త్ మానేశానన్నారు అనసూయ.  జబర్థస్త్ కి సినిమాలకు మధ్య ఇబ్బంది కలుగుతోంది. సినిమా షెడ్యూల్ ఉంటే జబర్థస్త్ షెడ్యూల్ మార్చాల్సి వస్తోంది. దానివల్ల ప్రిపేర్డ్ గా ఉన్న ఇక్కడివాళ్లకు ఇబ్బంది కలిగించాల్సి వస్తోంది. నాగురించి ఇక్కడి షెడ్యూల్ మార్చాల్సి వస్తోంది. అది నాకు గిల్టీగా అనిపిస్తుంది అన్నారు అనసూయ. 

58

ఇక ఎన్నేళ్ళు పనిచేసినా.. జబర్థస్త్ బోరు కొట్టదు. ఇక్కడ రకరకాల సందర్భాలు ఫేస్ చేశాను. నాపై వేసే పంచులకు నేను సీరియస్ రియాక్షన్ ఇస్తాను. కాని అవి చూపించరు అంతే.. నాకు నచ్చని సందర్భాలు చాలా ఉన్నాయి. క్రియేటీవ్ ఫీల్డ్ అన్న తరువాత ఇవన్నీ తప్పవూ.. కాని నేను మాత్రం ఈ ఊబితో చిక్కుకోవాలి అనుకోవడంలేదు.. కాని నేను ఎవరినీ బ్లేమ్ చేయదలచుకోవడంలేదు అన్నారు అనసూయ. 

 

68

ఈ రంగుల ప్రపంచంలోనేను ఇలా కాదు.. అలా అని చెప్పుకోవాలి అనుకున్నా.. అది ఆడియన్స్ ను చేరేది కాదు. బాడీ షేమింగ్ లాంటివి నాకు నచ్చవు, వాటిని గట్టిగా ప్రతిఘటిస్తాను. కాని అవి స్క్రీన్ పై వేయరు.... ఈ విషయంలో నేను చాలా స్ట్రగుల్ పడ్డాను.మరో విషయం ఏంటీ అంటే నాగాబాబు, రోజా గారు వెళ్లిపోయారు కాబట్టి తానుకూడా వెళ్ళిపోతున్నాను అన్న అబద్దపు ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత మాత్రం నిజం లేదు అన్నారు అనసూయ. 
 

78

వాళ్లు వెళ్లిపోయారు కదా అనే వెళ్లిపోవడానికి నేనేం గొర్రెల మంద టైప్ కాదు. ఓ గొర్రెల మంద నన్ను ఎటాక్ చేయడం జరిగింది చాలా రోజుల క్రితం. నాకు టీఆర్పీ గురించి పెద్దగా లెక్కలు తెలియవు. నేను స్టార్టింగ్‌లో చేసినప్పుడు హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. నాకిచ్చే జీతానికి నేను ఎంత చేయాలో అంత చేస్తాను. నాకు టీఆర్పీతో సంబంధం లేదు. నేను వాటిని పట్టించుకోను. అయితే ఇప్పటివరకూ నా వల్ల తక్కువ వచ్చిందని.. నేను తప్పు చేశాననే మాట నాకు ఇప్పటి వరకూ వినిపించలేదు అన్నారు అనసూయ. 

88

ఇక జబర్థస్త్ మానేసిన తరువాత ఫస్ట్ టైమ్ మనసు విప్పి మాట్లాడిన అనసూయ. అసలు నిజాలు ఇలా వెల్లడించారు. ఇక తాను సినిమాలపైఫోకస్ పెట్టబోతున్నట్ట చెప్పకనే చెప్పారు. స్పెషల్ పాత్రలతో సినిమాల్లో తనకంటై ఓ స్పెషల్ ఇమేజ్ సధించారు అనసూయ. ఇక మూవీ కెరీర్ ను పరుగులు పెట్టించబోతున్నట్టు తెలుస్తోంది. 

click me!

Recommended Stories