గొప్ప నిర్ణయం తీసుకున్న నటి మీనా, శభాష్ అంటున్న నెటిజన్లు

First Published Aug 13, 2022, 9:48 PM IST

భర్త మరణంతో ఈమధ్య ఎక్కువగా సోషల్ మీడియాల్ ట్రెండ్ అవుతున్నారు నటి మీనా. రకరకాల ఆరోపణలు కూడా వచ్చాయి మీనాపై. కాని వాటికి ధీటుగా సమాధానం చెప్పి ధైర్యంగా జీవితం సాగిస్తోంది సీనియర్ హీరోయిన్. ఇక ఈ మధ్య డేరింగ్ డెసిషన్ తో శభాష్ అనిపించుకుంటుంది మీనా. ఇంతకీ మీనా చేసిన పనేంటి.  

రీసెంట్ గా తన భర్తను కోల్పోయాను సీనియర్ హీరోయిన్ మీనా.  భర్త మరణం తర్వాత కొన్నాళ్ళు ఇంటికి పరిమితమైన మీనా... ఈమధ్యే మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. సినిమా షూటింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. ఆ మధ్య  రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఉన్న ఒక సినిమా షూటింగ్ లో పాల్గొన్న మీనా.. ఆ ఫోటోను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. 32 ఏళ్ళ తర్వాత నా మొదటి హీరోతో కలిసి నటిస్తున్నా క్యాప్షన్ కూడా రాశారు. 

భర్త పోయిన బాధనుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు మీన. తనకు ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ల రంభ, సంఘవి, సంగీత లాంటి స్టార్స్ ఫ్యామిలీస్ తో కలిసి  మీనా ఇంటికి వెళ్లారు. అక్కడ సందడి చేశారు. ఆ ఫోటోస్ ను కూడా మీనా షేర్ చేసుకున్నారు. ఇప్పుడిప్పుడు బాధల నుంచి బయట పడుతున్న మీనా.. ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో అందరి చేత శభాస్ అనిపించుకుంటున్నారు. 
 

హీరోయిన్ మీనా  తన తదనంతరం అవయవాల  ను దానం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.  ఈ నిర్ణయంతో ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా... మరణించిన తర్వాత మరి కొంత మందికి ప్రాణం పోసేలా ఉండాలనకున్నారు.   ఈ రోజు వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే  సందర్భంగా తన నిర్ణయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు మీనా. 

మీనా ఇన్ స్టాలో ఓ నోట్ ను పోస్ట్ చేశారు. తను ఎందుకు ఇలా చేస్తుందో వివరించారు. ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించిన మీనా ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప పని ఏదీ లేదు. ప్రాణాలు కాపాడటానికి అవయవ దానం మంచి మార్గం. దీర్ఘకాలిక అనారోగ్యాలతో పోరాటం చేస్తున్న అనేక మంది జీవితానికి రెండో అవకాశం ఇస్తుందీ అవయవ దానం. నా సాగర్ ఎక్కువ మంది డోనర్స్ ఉండుంటే నా జీవితం మరోలా ఉండేది అని రాశారు మీనా. 
 

ఇక మీనా ఈ నిర్ణయం తో అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. చాలా మంది తమ ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ముందుకు రారు. ముఖ్యంగా స్టార్స్ ఈ విషయంలో ఆలోచిస్తారు అటువంటిది మీనా ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక ఆమె భర్త విద్యాసాగర్  ఆకస్మిక మరణం కూడా ఒక కారణంగా  తెలుస్తోంది. మీనా భర్తకు ఊపిరితిత్తులు మార్చవలసి ఉంది. టైమ్ కి డోనార్ దొరక్క పోవడంతో ఆయన మరణించారు. 
 

ఇవాళ ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఆర్గాన్స్ డొనేట్ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నానని మీనా తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆర్గాన్ డొనేషన్ ఇంపార్టెన్స్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని మీనా అన్నారు. ఇలా అవయవాలు దానం చేయడం ద్వారా ఒక మనిషిని బ్రతికించడమే కాదు.. వారి కుటుంబాలలో కూడా ఆనందం నింపవచ్చన్నారు మీనా. 
 

click me!