Surprises To RRR: ఆర్ఆర్ఆర్ టీమ్‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన గూగుల్, తెలుగు సినిమాకు అరుదైన గౌరవం

First Published | Aug 13, 2022, 8:38 PM IST

ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కు ఊహించని సర్ ప్రైజ్ లభించింది. ఈరోజు అనగా శనివారం గూగుల్ ఈమూవీ బ్యాచ్ కు  స్వీట్ స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఇంతకీ ట్రిపుల్ ఆర్ టీమ్ కు దక్కిన ఆ సర్ ప్రైజ్ ఏంటీ..? 

టాలీవుడ్ విజయ పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎగరవేసిన దర్శకదీరుడు  ఎస్ఎస్.రాజమౌళి. ఈ స్టార్ డైరెక్టర్ రీసెంట్ గా  తెరకెక్కించిన  పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కు  సరికొత్త రికార్డులు తలవంచాయి.  ప్రపంచవ్యాప్తంగా ఓ స్పెషల్ ఇమేజ్ ను  క్రియేట్ చేసుకుందీ మూవీ 

ఆర్ ఆర్ ఆర్ సినిమా  రిలీజ్ అయ్యి  నాలుగు నెలలు దాటింది. కానీ ఈ సినిమా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.  ఏదో ఒక రూపంలో ఇంకా అలా వినిపిస్తూనే ఉంది. లేటెస్టుగా గూగుల్ ఆర్ఆర్ఆర్ క్రేజ్ గుర్తించి, ఒక స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ కీర్తి కలకాలం గుర్తుండేలా ఓ స్పెషల్ గిఫ్ట్ ను ఇచ్చింది. 


ప్రస్తుతం ఎవరికి ఏది కావలన్నా గుగుల్ లోనే సెర్చ్ చేస్తున్నారు. అంతలా జనాలకు గూగుల్ విపరీతంగా అలవాటు అయ్యింది.  అలానే  ఆర్ఆర్ఆర్ సినిమా గురించి  ఇప్పటికే   కొన్ని కోట్ల మంచి సెర్చ్ చేశారు. అలా ఎక్కువగా సెర్చ్ చేయబట్టి ఈసినిమా గొప్పతనం తెలసుకుంది గూగుల్ సంస్థ. ట్రిపుల్ ఆర్ నుంచి ఒక బైక్, గుర్రం వెళుతున్నట్టుగా గూగుల్ మార్క్ చేసింది. అంటే ట్రిపుల్ ఆర్ అని సెర్చ్ చేస్తే.. కింద గుర్రం, బైక్ కనిపిస్తాయన్న మాట. 

ఆర్ఆర్ఆర్ సినిమాలో  ఎన్టీఆర్ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పైన కనిపిస్తాడు. ఇక రామ్ చరణ్ ఎప్పుడూ గుర్రంపైనే కనిపించాడు.  ఈ సినిమా మోత్తం మీద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గుర్రం స్వారీ..., యంగ్ టైగర్ ఎన్టీఆర్  బైకు రైడ్  సన్నివేశాలు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఆ సీన్స్ గుర్తు చేసేలా... 'ఆర్ఆర్ఆర్' టీమ్‌కు గూగుల్ స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చింది. 

ఇక ఈ సర్ ప్రైజ్ గిఫ్ట్ తో ట్రిపుల్ ఆర్ టీమ్ దిల్ ఖుష్ అయ్యింది. గూగుల్‌కు ఆర్ఆర్ఆర్ టీమ్ అంతా స్పెషల్ గా సోషల్ మీడియా వేదికగా థాంక్స్ చెప్పింది.  థాంక్యూ గూగుల్... మమ్మల్ని స‌ర్‌ప్రైజ్‌ చేసినందుకు.. అలాగే, ప్రపంచవ్యాప్తంగా  ఆర్ఆర్ఆర్ కు ఉన్న పాపులారిటీని గుర్తించినందుకు అని 'ఆర్ఆర్ఆర్  టీమ్ పేర్కొంది. 

ఇక  ఆడియన్స్ కు ఆర్ఆర్ఆర్ టీమ్ ఒక విన్నపం కూడా చేసింది. గూగుల్‌లో ఆర్ఆర్ఆర్ అని సెర్చ్ చేసి స్క్రీన్ షాట్ లేదా వీడియో తీసుకుని RRR Take Over హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని నెటిజన్లను, ఆడియన్స్ ను కోరింది టీమ్. 
 

ఇక   ఎన్టీఆర్ కొమురం భీమ్ గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  సీతారామరాజుగా  నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా  1100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి... బాక్సాఫీస్ దగ్గర  మరోసారి తెలుగు సినిమా పవర్ ఏమిటో చూపించింది. ఇక ఈ సినిమా డిజిటల్ రిలీజ్ తరువాత హాలీవుడ్ ను సైతం ఆకర్షించింది. .పొగడ్తలతో పాటు విమర్షలు కూడా ఫేస్ చేసిందీ సినిమా. 

ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు జోడీలుగా ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగణ్, శ్రియా కీలక పాత్రలు పోషించగా... ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ మూవీస్ పతాకంపై డీవీవీ దానయ్య సినిమా నిర్మించారు.

Latest Videos

click me!