ఓ ఛానల్ లో అనసూయ యాంకర్ గా 'సీతారాముల కళ్యాణం చూతము రారండి' అనే కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ ప్రోగ్రాంని కలర్ ఫుల్ గా, కనుల పండుగగా ప్లాన్ చేశారు. ఇందులో ఆటో రామ్ ప్రసాద్, ఇమ్మాన్యూల్, వర్ష లాంటి బుల్లితెర సెలెబ్రిటీలు పాల్గొన్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.