నటిగా అనసూయ ఫుల్ బిజీ. ఆమె చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. టాలీవుడ్ మేకర్స్ అనసూయకు విలక్షణ పాత్రలు ఆఫర్ చేస్తున్నారు. గత ఏడాది అనసూయ నటించిన మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం వంటి చిత్రాలు విడుదలయ్యాయి. ఒక్కో చిత్రంలో ఒక్కో విధమైన పాత్ర చేసింది.