అనసూయ లగ్జరీ హౌస్ ని ఎప్పుడైనా చూశారా... ఇంటిని ఎంత నీట్ గా సర్ధుకుందో చూడండి!

Published : Apr 16, 2024, 11:53 AM IST

అనసూయ అందమైన ఇంటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అనసూయ ఇంటిని మొదటిసారి చూసిన ఫ్యాన్స్ వావ్ అంటున్నారు.   

PREV
17
అనసూయ లగ్జరీ హౌస్ ని ఎప్పుడైనా చూశారా... ఇంటిని ఎంత నీట్ గా సర్ధుకుందో చూడండి!
Anasuya Bharadwaj

అనసూయ భరద్వాజ్ పరిచయం అక్కర్లేని పేరు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అనసూయ స్టార్ గా ఎదిగింది. జబర్దస్త్ వేదికగా ఆమె పాపులారిటీ తెచ్చుకుంది. 

27
Anasuya Bharadwaj

అనసూయ ఒకప్పుడు పేదరికం అనుభవించిందట. అర్థ రూపాయి మిగల్చడానికి నెక్స్ట్ స్టాప్ వరకు నడుచుకుని వెళ్లి బస్ ఎక్కేదానిని అని అనసూయ ఓ సందర్భంలో చెప్పారు. పట్టుదలతో ఆమె జీవితంలో ఎదిగింది,. 

 

37
Anasuya Bharadwaj

యాంకర్ గా, నటిగా పేరు తెచ్చుకుంది. ఆమె సంపాదన లక్షలు, కోట్లకు చేరింది. అనసూయ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. హైదరాబాద్ లో ఆమెకు ఒక లగ్జరీ హౌస్ ఉంది. భర్త సుశాంక్, ఇద్దరు కొడుకులతో హ్యాపీ లైఫ్ అనుభవిస్తుంది. 

47
Anasuya Bharadwaj

అనసూయ ఇంటికి సంబంధించిన ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి. అనసూయ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో పూజలు నిర్వహించారు. సదరు ఫొటోల్లో అనసూయకి ఇంటి లోపలి భాగం మనం చూడవచ్చు. 

 

57
Anasuya Bharadwaj

షూటింగ్స్, మీటింగ్స్, ఈవెంట్స్ తో ఎప్పుడూ బిజీగా ఉండే అనసూయ తన ఇంటిని చాలా అందంగా సర్దుకుంది. ఖరీదైన ఫర్నిచర్, అందమైన ఇంటీరియర్ డిజైన్ తో ఆకట్టుకుంది. అనసూయ టేస్ట్ ఆ ఇంట్లోని వస్తువులు చూస్తుంటే అర్థం అవుతుంది. 
 

67
Anasuya Bharadwaj


అనసూయకు విశాలవంతమైన ఇంటితో పాటు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. అనసూయ భర్త జాబ్ చేస్తాడని సమాచారం. ఇక అనసూయ ఎంత బిజీగా ఉన్న కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేయదు. వారికి సమయం కేటాయిస్తుంది. జాలిగా గడుపుతుంది. 

 

77
Anasuya Bharadwaj

ఇక సోషల్ మీడియాలో అనసూయ చాలా యాక్టీవ్. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, వృత్తి పరమైన విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. అభిమానులు ఆమెను అభినందిస్తూ ఉంటారు. అదే సమయంలో ట్రోల్స్ కూడా ఉంటాయి. నెగిటివ్ కామెంట్స్ ని అనసూయ పట్టించుకోదు. 
 

Read more Photos on
click me!