Samantha: `తలైవి`గా సమంత ట్రెండింగ్‌.. కొత్తగా లైఫ్‌ని ప్రారంభిస్తుందట.. లేటెస్ట్ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి?

Published : Dec 04, 2021, 11:48 PM IST

సమంత.. చైతూతో విడాకుల తర్వాత తనలోని బాధని, ఎమోషన్‌ని పంచుకుంటూ అనేక పోస్ట్ లు పెడుతుంది. డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్ గా తన బాధని వ్యక్తం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు ఆమె పెట్టిన పోస్ట్ లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎవరిని ఉద్దేశించి పెట్టిందనేది ఇంట్రెస్ట్ గా, సస్పెన్స్ గా మారింది. 

PREV
18
Samantha: `తలైవి`గా సమంత ట్రెండింగ్‌.. కొత్తగా లైఫ్‌ని ప్రారంభిస్తుందట.. లేటెస్ట్ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి?

సమంత, నాగచైతన్య కలిసి దాదాపు `ఏం మాయ చేసావె` సినిమా నుంచి దగ్గరవుతూ వస్తోన్నారు. పెళ్లికి ముందు రెండు మూడేళ్లుగా డీప్‌ లవ్‌లో ఉన్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు చెప్పి, ఒప్పించి మ్యారేజ్‌ చేసుకున్నారు. 2017లో మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. కరెక్ట్ గా నాలుగేండ్లకే అంటే ఈ ఏడాది అక్టోబర్‌ 2న తామిద్దరం విడిపోతున్నట్టు సమంత, చైతూ ప్రకటించారు. అభిమాన లోకానికే కాదు, సినీ వర్గాలకు సైతం పెద్ద షాక్‌ ఇచ్చారు. 

28

ఈ షాక్‌ అభిమానులకే కాదు, వారికి కూడా. వాళ్లలో వాళ్లు ఎంతగానో మదన పడుతున్నారు. బాధపడుతున్నారు. ఇక అమ్మాయిగా సమంతలో ఆ బాధ మరింతగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే తన బాధని పరోక్షంగా వ్యక్తం చేస్తుంది సమంత. ఇండైరెక్ట్ పోస్ట్ లతో, అమ్మ చెప్పిన డైలాగ్‌లతో ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంది. 

38

తాజాగా సమంత ఓ ఆసక్తికర పోస్ట్ ని పెట్టింది. `అమ్మ చెప్పింది` అనే పోస్ట్ లో పేర్కొంటూ `నాలోని కొత్తదనం నీకు తెలియదు. నా జీవితాన్ని తిరిగి కొత్తగా పేర్చుకుంటా` అని పేర్కొంది. తన తల్లికి పంపిన మెసేజ్‌ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది సమంత. దీనికి వాళ్లమ్మ స్పందిస్తూ `దేవుడి ఆశీస్సులు నీకు ఉంటాయి తల్లి` అని సమంత తల్లి పేర్కొంది. ప్రస్తుతం ఈ సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 
 

48

అయితే అమ్మకి చెప్పినట్టుగా, అమ్మ చెప్పిన సందేశాలంటూ పేర్కొంటూనే సమంత,ఆ సందేశాలను పరోక్షంగా ఇంకా వేరే వ్యక్తులకు అని అంటున్నారు నెటిజన్లు. అది పరోక్షంగా నాగచైతన్యకే చెబుతుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఇది మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

58

దీంతోపాటు ఇన్‌స్టా స్టోరీస్‌లో మరో సందేశాన్ని షేర్‌ చేసుకుంది. నేను జీవితంలో నేర్చుకున్న గొప్ప పాఠం ఏంటంటే.. నేను నేర్చుకోవాల్సిందే ఇంకా చాలా ఉంది` అని పేర్కొంది. ఇలాంటి కొటేషన్లు ఈ మధ్య బ్యాక్‌ టూ బ్యాక్‌ పంచుకుంటుంది సమంత. 

68

నాగచైతన్యతో విడాకులు తర్వాత సమంత సోషల్‌ మీడియాలో స్ఫూర్తి నింపే, ప్రభావితం చేసే విషయాలను షేర్‌ చేస్తోంది. `అమ్మ చెప్పింది` శీర్షికతో కౌంటర్లు ఇస్తుంది. విడాకుల విషయంలో విమర్శించిన వారికి సున్నితంగానే సమాధానం చెబుతోంది. తనను నిందించిన వారిని నాగరికతతో వ్యవహరించమని హితవు పలికింది. 
 

78

మరోవైపు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది సమంత. ట్విట్టర్ ఆమె `తలైవి`గా ట్రెండ్‌ అవుతుండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈతరం `తలైవి`గా సమంతని అభివర్ణిస్తూ అభిమానులు,నెటిజన్లు పోస్ట్ లు పెట్టడం, దాన్ని ట్రెండ్‌ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సమంతని నెక్ట్స్ లేడీ సూపర్‌స్టార్‌గా, ఓ `తలైవి`గా చూడబోతున్నారనే విషయాన్ని అభిమానులు స్పష్టం చేస్తున్నారని చెప్పొచ్చు. 
 

88

సమంత ఇప్పుడు గ్లామర్‌ విసయంలో హద్దులు చెరిపేస్తుంది. ఇటీవల `ఎల్లీ` మ్యాగజీన్‌ కోసం హాట్‌ షోతో రెచ్చిపోయింది. నెవర్‌ బిఫోర్‌ అనేలా పోజులిచ్చి కుర్రాళ్ల మతిపోగొట్టింది. మరోవైపు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగులో `శాకుంతలం`, తమిళంలో `కాతు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో నటించగా, కొత్తగా మరో రెండు తెలుగు, తమిళం బైలింగ్వల్‌ చిత్రాలకు ఓకే చెప్పింది. దీంతోపాటు ఓ ఇంటర్నేషనల్‌ పిక్చర్‌కి సైన్‌ చేసింది  సమంత. కెరీర్‌ పరంగా అసలైన జర్నీ ఇప్పుడే ప్రారంభమైందనే సంకేతాలనిస్తుంది సామ్‌. 

also read: గ్రీన్‌ డ్రెస్‌లో థై షోతో పిచ్చెక్కిస్తున్న విజయ్‌ భామ.. మాళవిక మోహనన్‌ వీకెండ్‌ ట్రీట్‌కి ఫ్యాన్స్ పండగ
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories