Intinti Gruhalakshmi: తులసిని నాశనం చేసే ప్రయత్నంలో లాస్య.. ఆమెకు సపోర్ట్ గా అనసూయ!

Published : Oct 22, 2022, 10:53 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు అక్టోబర్ 22వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

PREV
110
Intinti Gruhalakshmi: తులసిని నాశనం చేసే ప్రయత్నంలో లాస్య.. ఆమెకు సపోర్ట్ గా అనసూయ!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. నందు తులసి తో, సామ్రాట్ తో నీకు స్నేహం ఉంటే నీ వరకే చూసుకో కానీ ఇంటి వరుకూ తేవొద్దు ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోమని చెప్పొద్దు అని అంటాడు. దానికి సామ్రాట్ అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు తులసి సామ్రాట్ ని ఆపి, సామ్రాట్ గారు మీరు ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. మీకోసమే అని సామ్రాట్ అనగా, అయితే మరి నేను చెప్పినప్పుడే వెళ్ళండి ఎవరో చెప్పినప్పుడు వెళ్తే మీరు నాకు మర్యాద ఇవ్వలేనట్టు అవుతుంది. ఇది నా ఇల్లు నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండండిఎప్పుడు కావాలంటే అప్పుడు రండి అని అంటుంది. దానికి లాస్య, చూశారా ఇల్లు వచ్చిన వెంటనే దీనికి పొగరు వచ్చింది అని అనగా పరంధామయ్య మనసులో, హమ్మయ్య ఇప్పుడైనా కొంచెం ధైర్యం వచ్చింది ఇంక నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటాడు.

210

అప్పుడు నందు తులసితో, ఈ ఇల్లు నీది కావచ్చు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు నా వాళ్ళు నా పిల్లలు అని అనగా, నా పిల్లలు కూడా నా పిల్లలే అని అంటుంది. దానికి లాస్య, మనం ఎన్ని మాట్లాడినా మావయ్య గారు తులసి మాత్రమే తోడుగా ఉంటారు ఇంకా ఎక్కువ మాట్లాడితే మనల్ని గెంటేస్తారు కూడా మనకి ఇంట్లో సపోర్ట్ లేదు.ఇంక వెళ్లిపోదాము అని లాస్య వాళ్ళు వెళ్లిపోతూ వుండగా అనసూయ లాస్యని ఆపి, ఆగు లాస్య.నందు నా పెద్ద కొడుకు ఈ ఇంట్లో నందుకి ఎంత అర్హత ఉన్నాదో నాకు తెలీదు కానీ గౌరవం మాత్రం ఉన్నాది. నా పెద్ద కొడుకుని ఎవరైనా ఏమైనా అంటే నేను సహించలేను నా పెద్ద కొడుకు కూడా ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావొచ్చు వద్దని చెప్తే నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. దానికి తులసి, నేను ఎప్పుడూ ఎవరిని ఇంటికి రావద్దు అని చెప్పలేదు అత్తయ్య నా జీవితంలోకి జోక్యం చేసుకోవద్దు అని చెప్పాను. నేను ఎవరితో వెళ్తే వాళ్లకెందుకు? సామ్రాట్ గారు ఈరోజు నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వస్తారు.

310

ఇద్దరు ఒక్క కారులోనే వెళ్తాము పక్క పక్కనే కూర్చుని వెళ్తాము వరంగల్ వరకు వెళ్తున్నాము రహస్యంగా కాదు అందరికీ చెప్పే వెళ్తున్నాము ఎవరు ఆపుతారో ఆపండి. మళ్లీ ఈ విషయాన్ని పట్టుకొని రేపు పెద్ద చర్చలు చేసుకొని అదే మాటలు మళ్ళీ మళ్ళీ అంటే చెప్పడానికి మీకు విసుగు రాకపోయినా వినడానికి నాకు విసుగు వస్తుంది. ఒక పని చేయండి ఫోన్లో వాయిస్ రికార్డర్ ఓపెన్ చేసి మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి తీరిక ఉన్నప్పుడు వింటాను అని అంటుంది తులసి. సామ్రాట్ గారు మా వాళ్ళు ఎవరైనా మీ మనసు బాధపెట్టి ఉంటే వాళ్ళ తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను రేపు కలుద్దాము అని తులసి అంటుంది.అప్పుడు సామ్రాట్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.తులసి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు పరంధామయ్య, ఆ ఫోన్ రికార్డర్ ఆలోచన ఏదో బాగున్నది మీరు కూడా నాకు అలాగే పంపండి అలాగే అనసూయ నువ్వు కూడా ఈ మధ్య అలాగే మాట్లాడుతున్నావు కదా ట్రై చేయు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. 

410

అప్పుడు అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. లాస్య కోపంతో నందుతో మాట్లాడుతూ, ఏంటి నందు ఇది తులసి ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడినా మావయ్య గారు ఏమీ అనరు కానీ మనల్ని మాత్రమే అంటారు అని అంటుంది.ఆ తర్వాత సీన్లో జరిగిన విషయం అంతా గుర్తు తెచ్చుకుంటూ అనసూయ మౌనంగా ఉంటుంది. దానికి పరంధామయ్య, నాతో మాట్లాడవా అనసూయ మనం ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామో తెలీదు రేపు ఉదయం కళ్ళు తెరుస్తానో లేదో కూడా తెలియదు భూమ్మీద ఉన్నంతకాలం మాట్లాడకుండా ఉంటే తర్వాత ఎంత మాట్లాడదాం అనుకున్నా మాట్లాడలేము అని అనగా, మీరు అలా బాధపడొద్దు నాకు కోపం నీ మీద కాదు నా మాట వినలేని తులసి మీద. అయినా అది కోపం కూడా కాదు బాధ మాత్రమే నేను ఏం అడగలేదు కేవలం సామ్రాట్ తో మాట్లాడొద్దు అని అన్నాను.
 

510

అయినా తనకెందుకు అంత పంతం అని అంటుంది అనసూయ. దానికి పరంధామయ్య,  నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు అనసూయ అత్తయ్య మాట నేనెప్పుడూ జవదాట లేదు కదా నన్ను ఎందుకు అత్తయ్య అర్థం చేసుకోవడం లేదు అని తులసి అనుకుంటుంది కదా అని అంటాడు పరంధామయ్య. దానికి అనసూయ, మీరు నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటే తులసిని వెనకేసుకొని వస్తున్నారు మీ అండ చూసుకొని తులసి ఇంకా రెచ్చిపోతుంది నాకు అస్సలు విలువ ఇవ్వడం లేదు అని అనగా, మరి నువ్వు మొన్న మాట్లాడిన మాటలకి ఎవరో అయితే తిరిగి మొఖం కూడా చూసేది కాదు. నువ్వు కాబట్టి ఊరుకున్నది. ఈ మధ్య నీ ప్రవర్తన కూడా బానే మారుతుంది ఆ లాస్య నిన్ను అండగా చూసుకొని ఇంటికి అంత ధైర్యంగా వస్తుంది ఏదో ఒక రోజు ముంచేస్తది అని అనసూయ కి సలహా ఇస్తాడు పరంధామయ్య. తులసిని సామ్రాట్ దగ్గర ఉద్యోగం మానిపిస్తేనే నేను మారతాను అని అనసూయ అంటుంది. 

610

ఇంక పరంధామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో తులసి, అంకితలు బట్టలు సర్దుకుంటూ, ఇల్లు మారిన తర్వాత బట్టలు సర్దుకోవడం అంటే పెద్ద పనే అని అనుకుంటారు. దానికి అంకిత, ఇదే సొంతిల్లు కదా ఆంటీ.ఇంక పదే పదే మార్చుకోవాల్సిన అవసరం లేదు అని అనగా, సరే అమ్మ ఇంకా నువ్వు వెళ్లి పడుకో టైం అవుతుంది అని అంటుంది తులసి. అప్పుడు అంకిత వెళ్ళిపోయిన తర్వాత సామ్రాట్ తులసికి ఫోన్ చేస్తాడు. ఎందుకు చేశారు అని అడగగా, ఊరికినే చేశాను రేపు మనం అక్కడికి వెళ్తున్నాం కదా గుర్తుందా అని అడుగుతాడు. దానికి తులసి, నాకు ఒకసారి చెప్తే గుర్తుంటుంది మీరు చెప్పే ఫైల్స్ అన్ని పట్టుకున్నాను ఏది మర్చిపోలేదు రేపు సమయానికి ఉంటాను అని అనగా సామ్రాట్, నేనే అయితే మర్చిపోతున్నానేమో అందుకే మీకు మళ్ళీ గుర్తు చేశాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
 

710

ఫోన్ పెట్టిన తర్వాత నవ్వుతూ ఉన్న సామ్రాట్ ని చూసిన వాళ్ళ బాబాయ్, ఈరోజు రాత్రి ఇంక నీకు నిద్ర పట్టదు కదా రేపు తులసి తో వెళ్తున్నందుకు అని అనగా,అవునూ అయితే ఏంటి అని అడుగుతాడు. నిజం చెప్పినందుకు థాంక్స్ నువ్వు తలుచుకుంటే జీవితాంతం ఇంతే ఆనందం తో ఉండొచ్చు అని అంటాడు. ప్రతిదీ మనం అనుకున్నట్టు అవ్వదు బాబాయ్ ఇంక వొదిలె అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సామ్రాట్. ఆ తర్వాత రోజు ఉదయం నందు ఎవరితోనో మాట్లాడుతూ నేను వస్తున్నాను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటాడు.అప్పుడు లాస్య,ఇక్కడకి వెళ్తున్నావు అని అడగగా, మా ఫ్రెండ్ ఒకడి కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయట ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అని అంటాడు నందు. దానికి లాస్య, రేపు వెళ్ళు నందు ఈరోజు పనున్నది అని అనగా ఏంటి అని నందు అడుగుతాడు. 

810

ఈరోజు మనం మీ ఇంటికి వెళ్ళాలి అని లాస్య అంటుంది. దానికి నందు, నిన్న జరిగింది చాలదా మళ్ళీ ఈరోజు కూడా వెళ్లి తిట్లు తినాలా అయినా ఆ ఇంటికి నేను రాను అని అనగా, అది మన ఇల్లు కూడా నందు మన ఇంటికి వెళ్లడానికి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అక్కడికి సామ్రాట్ వస్తే రాని.స్నేహితుడే అలా వచ్చి పోయినప్పుడు ఇంటి కుటుంబ సభ్యులు మనం రాలేమా అయినా అత్తయ్యకి మన మీద మంచి అభిప్రాయం ఉన్నది కదా నీకు అత్తయ్య ఉంటే చాలా ఇష్టం కదా! నువ్వు అత్తయ్యకు దూరంగా ఉండగలవా మంచి సమయం చూసి అత్తయ్యని ఒప్పించి అక్కడే మనం ఉండిపోయేలా చేసుకుందాము అని అంటుంది లాస్య. ఆ తర్వాత సీన్లో తులసి చీర కట్టుకొని తయారవుతూ ఉంటుంది. అప్పుడు అనసూయ కొత్త చీర కట్టినట్టు ఉన్నది చాలా బాగా తయారవుతుంది అని అనుకుంటుంది. అప్పుడు కార్ సౌండ్ వినిపిస్తుంది.

910

 నేను వెళ్ళొస్తాను అత్తయ్య అని అనగా, పూర్వం కోడళ్ళు అత్తగారి మీద ఎంత భయంతో ఉండేవారో పుట్టింటికి వెళ్తాము అంటే వారం నుంచి అడిగేవారు ఇప్పుడు కోడలు ఏమాత్రం భయంగా లేరు ఆ రోజులే వేరు ఆ మర్యాదలన్నీ గాలికి ఎగిరిపోయాయి అని కోపంతో అంటుంది. దానికి పరంధామయ్య, తులసిలు నవ్వుకుంటూ ఉంటారు. తులసి బయలుదేరుదాం అని చూడగా అక్కడ లాస్య,నందు లు ఉంటారు. ఏంటి తులసి, కారు శబ్దం వినగానే సామ్రాట్ అనుకుని బయలుదేరిపోయావా ప్రతిరోజు ఆ కార్ లోనే ఉంటావు కదా ఎక్కడికి ఎక్కడికో తిరుగుతావు కదా కారు కూడా గుర్తుపట్టలేదా అని అంటుంది.అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ప్రేమ్ అడగగా ఊరికినే ఇల్లంతా చాలా సరదాగా ఉన్నది కదా అలా బయటకు వెళ్లడానికి వచ్చాము అందరూ వెళ్దామని అంటుంది లాస్య. దానికి అంకిత, ఆంటీ ఇంట్లో ఉండనప్పుడు మేము బయట ఎలా వస్తాము ఆంటీ లేకుండా మేము రాము అని అంటారు. దానికి ప్రేమ్, సామ్రాట్ గారి  తో అమ్మ బయటకు వెళ్తుంది.

1010

తమాషా చేయడానికి మంచి సమయం చూసుకొని వచ్చారు కదా అబద్ధం ఎందుకులెండి అని అంటాడు ప్రేమ్. దానికి లాస్య, అంత సీన్ లేదు అని ప్రేమ్ తో చెబుతూ తులసిని చూస్తూ, కొత్త చీర కట్టినట్టు ఉన్నావు.ఎవరు కొన్నారు ఏంటి ఇంత మంచి రోజు కట్టుకొని వెళ్తున్నావు అని అడగగా, ఒకప్పుడు మా ఆయన కొన్నారులే కట్టుకునే సమయం దొరకలేదు ఇప్పుడు కొట్టుకున్నాను అని అంటుంది తులసి. దానికి లాస్య ఆశ్చర్యపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories