అనసూయపై అడల్ట్ జోకులు.. వాళ్ళిద్దరి వల్లే జబర్దస్త్ మానేశా, షాకిచ్చిన హాట్ యాంకర్

Published : Jan 20, 2023, 07:02 PM IST

సోషల్ మీడియాలో ఘాటైన ఫోజులతో అనసూయ ఎంత పాపులారిటీ సొంతం చేసుకుందో తెలిసిందే. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది.

PREV
16
అనసూయపై అడల్ట్ జోకులు.. వాళ్ళిద్దరి వల్లే జబర్దస్త్ మానేశా, షాకిచ్చిన హాట్ యాంకర్

సోషల్ మీడియాలో ఘాటైన ఫోజులతో అనసూయ ఎంత పాపులారిటీ సొంతం చేసుకుందో తెలిసిందే. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. అందుకే అనసూయ క్రేజ్ మరోస్థాయికి చేరింది. 

26

రంగస్ధలంలో రంగమ్మత్తగా ఆకట్టుకున్న అనసూయ.. పుష్పలో దాక్షాయణి గా అదరగొట్టింది. డీ గ్లామర్ రోల్ లో సైతం మెప్పించింది. అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో.. అదే స్థాయిలో ఆమెని వివాదాలు కూడా చుట్టుముడుతుంటాయి. 

36

ఆ మధ్యన సోషల్ మీడియాలో నెటిజన్లు అనసూయని ఆంటీ అని పిలవడంతో ఈ హోల్డ్ యాంకర్ సహించలేకపోయింది. వారిపై లీగల్ చర్యలకు కూడా అనసూయ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీనితో అనసూయ ఏం చేసినా సంచలనంగా మారుతోంది. 

46

సుదీర్ఘకాలం జబర్దస్త్ షోకి యాంకరింగ్ చేసిన అనసూయ గత ఏడాది అనూహ్యంగా ఈ షో నుంచి తప్పుకుంది. అనసూయ జబర్దస్త్ నుంచి ఎందుకు తప్పుకుంది.. ఎవరితో అయినా విభేదాలా అనే కోణంలో కూడా నెటిజన్ల మధ్య చర్చ జరిగింది. సినిమాలతో బిజీ అవుతుండడంతో ఎలాంటి షోలకు అనసూయ టైం కేటాయించలేకపోతోందని కూడా ప్రచారం జరిగింది. 

56

అయితే అనసూయ తాజాగా తాను జబర్దస్త్ ఎందుకు మానేసిందో వివరించింది. తాను జబర్దస్త్ మానేయడానికి కారణం ఇద్దరు వ్యక్తులు అంటూ అందరిని షాక్ కి గురిచేసింది. హైపర్ ఆది లాంటి కమెడియన్లు అనసూయపై అడల్ట్ జోకులు వేయడం చూశాం. దీనితో వారి వల్లే అనసూయ జబర్దస్త్ మానేసిందా అనే అనుమానం రావచ్చు. కానీ అది వాస్తవం కాదట. 

66

తన ఇద్దరు పిల్లల వల్లే తాను జబర్దస్త్ మానేసినట్లు అనసూయ తెలిపింది. నానా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వారికోసం టైం కేటాయించలేకున్నాను. ఈ షోలో నాపై వేస్తున్న జోకులు విని వారి మనసు నొచ్చుకునే అవకాశం ఉంది. అందుకే జబర్దస్త్ నుంచి తప్పుకున్నట్లు అనసూయ పేర్కొంది. 

click me!

Recommended Stories