చీరకట్టులో కట్టిపడేస్తున్న మలయాళీ భామ.. కసి చూపులతో కలవరపెడుతున్న మాళవికా మోహనన్!

First Published | Jan 20, 2023, 6:10 PM IST

యంగ్ హీరోయిన్ మాళవికా మోహనన్ చీరకట్టులో ఆకట్టుకుంటోంది. ఓవైపు సంప్రదాయ దుస్తుల్లో మైమరిపిస్తూనే.. మరోవైపు గ్లామర్ విందుతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

మలయాళ నటి మాళవికా మోహనన్ (Malavika Mohanan) చీరకట్టుకు నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు. వరుసగా సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తున్న ఈ బ్యూటీ కుర్ర గుండెల్లో అలజడి రేపుతోంది.
 

నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన అభిమానులను ఖుషీ చేసేందుకు క్రేజీ అప్డేట్స్ అందిస్తూ వస్తోంది. మరోవైపు గ్లామర్ విందుతోనూ మతిపోగొడుతోంది.
 

Latest Videos


ఈ సందర్భంగా ట్రెడిషనల్ వేర్ లో వరుస ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. తనదైన శైలిలో ఫొటోలకు పోజులిస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా మాళవికా మోహనన్ చీరకట్టు లో మెరిసింది. ఆఫొటోలను  ఫ్యాన్స్ తో పంచుకుంది.
 

క్రీమ్ కలర్ ట్రాన్స్ ఫరెంట్ శారీలో హోయలు  పోయింది.  చీరకట్టులో స్లిమ్ ఫిట్ అందాలను చూపిస్తూ కట్టిపడేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మలయాళీ భామ టాప్ గ్లామర్ షో అదిరింది. మరోవైపు చురకత్తుల్లాంటి చూపులతో కుర్ర గుండెల్ని గుల్లచేసింది.

సంక్రాంతి పండుగకు పదహారేళ్ల అమ్మాయిలా హాఫ్ శారీలో మెరిసిన ఈ బ్యూటీ.. అప్పటి నుంచి సంప్రదాయ దుస్తుల్లోనే మెరుస్తోంది. దీంతో ట్రెడిషనల్ లో మరింత అందంగా ఉందంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. మాళవికా ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. 
 

ప్రస్తుతం మాళవికా మలయాళం, తమిళం, హిందీలో అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్తోంది. ఇక టాలీవుడ్ ఎంట్రీకీ ప్రయత్నిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మారుతీ చిత్రంలో నటించే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక గతంలోనే విజయ్ దేవరకొండ సరసన నటించాలని ఉందంటూ ఓపెన్  అయిన విషయం తెలిసిందే.
 

click me!