`సింబా` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొంది అనసూయ. ఇందులో ఆమె మాట్లాడుతూ, ఏవీ చూసుకున్నాక తాను ఇన్ని సినిమాలు చేశానా? అనే ఫీలింగ్‌ని తెచ్చిపెట్టిందని, ఎంకరేజ్ చేసేలా చేసిందని, మీ అభిమానం, అభినందనలే తనకు ఎంకరేజ్, ఉత్సాహాన్ని తెస్తుంది. మరిన్ని సినిమాలు, మంచి విలక్షణమైన పాత్రలు చేసేలా చేస్తుందని తెలిపింది అనసూయ. అలాంటి మరో పాత్రని `సింబా` సినిమాలో చేస్తున్నట్టు తెలిపింది. ఎప్పటికీ గుర్తిండిపోయే రోల్ అని పేర్కొంది. ఇదొకి కొత్త జోనర్ అని, సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పింది. ఇందులో భాగం కావడం గర్వంగా ఉందని చెప్పింది అనసూయ.