Anasuya: షర్ట్ బటన్‌ విప్పేసి మేకప్‌ లేకుండా షాకిచ్చిన `జబర్దస్త్` యాంకర్.. అసలైన అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ..

Published : Jun 21, 2022, 07:54 AM IST

యాంకర్‌ అనసూయ అందానికి, హాట్‌నెస్‌కి కేరాఫ్‌. తరచూ ఆమె అందంపైనే చర్చ జరుగుతుంటుంది. మేకప్‌, ఏజ్‌, డ్రెస్‌ ఇలా ప్రతిది నెట్టింట హాట్‌ టాపిక్‌ అవుతుంటాయి. లేటెస్ట్ గా ఆమె మేకప్‌ లేకుండా కనిపించింది.  

PREV
17
Anasuya: షర్ట్ బటన్‌ విప్పేసి మేకప్‌ లేకుండా షాకిచ్చిన `జబర్దస్త్` యాంకర్.. అసలైన అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ..

`జబర్దస్త్` యాంకర్‌గా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్‌.. లేటెస్ట్ గా మరోసారి తన డేర్‌ని ప్రదర్శించింది. ఎప్పుడూ మేకప్‌ పూసిన అందాలనే కాదు, తన రియల్‌ అందాలను కూడా చూపించాలని నిర్ణయించుకుంది. మేకప్‌ లేకుండా దిగిన ఫోటోని పంచుకుంది. ఈ ఫోటోని తన భర్త సుశాంక్‌ భరద్వాజ్‌ తీయడం విశేషం.

27

ఇందులో అనసూయ షర్ట్ పై బటన్‌ విప్పేసి అందాలతో దోబూచులాడుతుంది. మరోవైపు మేకప్‌ లేకుండా సహజమైన అందాలు చూపిస్తూ కుర్రాళ్లకి షాకిస్తుంది. అయితే ఇందులో అన్ను బేబీ అందం మాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఆమె చెబుతూ, మనకు ఒకేజీవితం ఉందని, దాన్ని సరైన విధంగా జీవిస్తే మరో లైఫ్‌ అవసరం లేదని తెలిపింది.

37

ఛాన్స్ దొరికితే అనసూయ అందంపై, మేకప్‌పై, బట్టలపై కామెంట్‌ చేసే నెటిజన్లు ఈ సారి మాత్రం ఆమెపై ప్రశంసలు కురిపించడం విశేషం. మేకప్‌ లేకపోయినా ఎంతో క్యూట్‌గా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. వయసు తగ్గినట్టుగా ఉందని, క్యూట్‌నెస్‌ ఓవర్‌ లోడ్‌ అని కామెంట్లతో ఆమె పిక్‌ని వైరల్‌ చేస్తున్నారు. 
 

47

అనసూయ ఇటీవల పంచుకున్న ఫోటోలపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె మేకప్‌ సరిగా లేదని, దీంతో ముసలిదానిలా కనిపిస్తున్నావ్‌ అని, వయసైపోయిందని అంటూ రకరకాల కామెంట్లు చేశారు. కానీ మేకప్‌ లేకుండా కనిపిస్తే అందుకు భిన్నంగా రియాక్ట్ కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

57

అనసూయ కెరీర్‌ పరంగా చాలా బిజీగా ఉంది. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ ల్లో అనసూయ అంత బిజీగా మరే నటి లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. `పుష్ప2`, `రంగమార్తాండ`, `దర్జా`, `సింబా`, `వాంటెడ్‌ పండుగాడ్‌` వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తుంది. తమిళంలోనూ ఓ సినిమా చేస్తుంది అనసూయ. 
 

67

టీవీ షోస్‌లో గ్లామర్‌ విందు వడ్డించే రంగమ్మత్త.. సిల్వర్‌ స్క్రీన్‌పై మాత్రం పద్ధతిగానే ఉంటానని చెబుతుంది. అందాల ఆరబోతకు ఛాన్స్ లేదని, కేవలం నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలే చేస్తానంటోంది. అయితే ప్రాధాన్యత ఉంటే ఐటెమ్‌సాంగ్‌లు కూడా చేస్తుంది. ఆ మధ్యన `చావు కబురు చల్లాగా` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేయగా, దానికి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. దీంతో నటనపైనే ఫోకస్‌ పెట్టింది అనసూయ. 

77

మరోవైపు టీవీ షోస్‌లోనూ బిజీగా ఉంది. `జబర్దస్త్` షోతోపాటు కొత్తగా `సూపర్‌ సింగర్‌ జూనియర్స్` పాటల షోకి సుడిగాలి సుధీర్‌తో కలిసి యాంకరింగ్‌ చేస్తుంది. దీంతోపాటు మరో షోకి కూడా ప్లాన్‌ జరుగుతుందని సమాచారం. ఏదేమైనా ఇటు టీవీ, అటు సినిమా రంగాలను ఊపేస్తుంది హాట్‌ యాంకర్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories