‘లేడీ పవర్ స్టార్’ ట్యాగ్ పై స్పందించిన సాయి పల్లవి.. అలా అంటోందేంటి?

Published : Jun 20, 2022, 06:53 PM IST

హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అగ్ర స్థాయి హీరోయిన్ల కన్నా సాయి పల్లవి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువేనని చెప్పాలి. అందుకే ఆమెను ‘లేడీ పవర్ స్టార్’ అని కొనియాడుతున్నారు.  ఈ ట్యాగ్ పై సాయి పల్లవి తాజాగా స్పందించింది.  

PREV
18
‘లేడీ పవర్ స్టార్’ ట్యాగ్ పై స్పందించిన సాయి పల్లవి.. అలా  అంటోందేంటి?

నేచురల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్న సాయి పల్లవి వరుస చిత్రాల్లో నటిస్తూ బీజీగా ఉంది. అటు తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటోంది. ప్రస్తుతం అగ్ర స్థాయి హీరోయిన్లే బీట్ చేసేలా సాయి పల్లవికి ఇమేజ్ ఏర్పడింది. 
 

28

మలయాళంలో ‘ప్రేమమ్’ చిత్రంతో మంచి బ్రేక్ పడింది. ఆ తర్వాత డైరెక్ట్ గా ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో తెలంగాణ అమ్మాయిగా సాయి పల్లవి అద్భుతంగా నటించింది. అలాగే డాన్స్ స్టెప్పులతో మతిపోగొట్టింది. ఈ చిత్రం తర్వాత వరుసగా టాలీవుడ్, కోలీవుడ్ లో చిత్రాలు చేసుకుంటూ వస్తోంది.
 

38

ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ గానే మారిపోయిందీ బ్యూటీ. అయితే సాయి పల్లవికి తెలుగు ఆడియెన్స్ లో యమ క్రేజ్ ఉంది. ఆమె నటన, డాన్స్, ముఖ్యంగా ఆమె ప్రవర్తనకు అభిమానులు ఫిదా అయ్యారు. సినిమా సినిమాకు సాయి పల్లవి టాలీవుడ్ లో నాటుకుపోతోంది. అగ్ర స్థాయి హీరోయిన్లకే ధీటుగా నిలుస్తోంది.

48

అయితే తాజాగా తను దర్శకుడు వేణు ఊడుగుల డైరెక్షన్ లో ‘విరాట పర్వం’ చిత్రంలో నటించింది. రానా దగ్గుబాటి సరసన ‘వెన్నెల’ పాత్రలో ఒదిగిపోయింది. ఆమె నటనకు అంతా ఫిదా అవుతున్నారు. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు.
 

58

ఈవెంట్ లో స్పెషల్ ఏవీలు ప్రదర్శించే సమయంలో మేకర్స్ అఫిషియల్ గా సాయి పల్లవికి ‘లేడీ పవర్ స్టార్’అనే ట్యాగ్ లైన్ ను అనౌన్స్ చేశారు. స్క్రీన్ పై తన పేరుకు ముందు వచ్చిన లేడీ పవర్ స్టార్ ట్యాగ్ లైన్ చూసుకొని స్టేజీపైనే ఏడ్చేసిన విషయం తెలిసిందే. అంతటి అభిమానాన్ని చూపిన తెలుగు ప్రేక్షకులకు, తన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
 

68

తాజాగా ఈ ట్యాగ్ పై స్పందించి సాయి పల్లవి. తనను లేడీ పవర్ స్టార్ గా అభివర్ణించడం పట్ల ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది... పేరుకు ముందు ట్యాగ్స్ పెట్టుకోవడం కరెక్ట్ కాదనేది తన అభిప్రాయంగా చెప్పింది. అందుకే వాటికి కనెక్ట్ కానని చెప్పింది. తను పోషించిన పాత్రలు అభిమానులకు నచ్చడం వల్లే ఆదరిస్తున్నారని తెలిపింది. ట్యాగ్స్ ని తలకెత్తుకుంటే తలకు భారమేనని, భవిష్యత్ దెబ్బతింటుందని కామెంట్ చేసింది. అందుకే తను సాధారణంగానే ఉంటానని తెలిపింది.  
 
 

78

అయితే శర్వానంద్‌, రష్మిక మందన్నా జంగా నటించిన చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`.  ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను ఫిబ్రవరి 27న గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ కు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) హాజరయ్యారు. వేదికపై మాట్లాడుతూ అందరూ హీరోయిన్లను అభినందిస్తూ.. సాయి పల్లవి విషయంలో సంచలనంగా కామెంట్ చేశారు. అదే ‘లేడీ పవన్ కళ్యాణ్’ అంటూ పిలవడం. అప్పటి నుంచి ఆమెను అభిమానులు ‘లేడీ పవర్ స్టార్’ అని పిలవడం ప్రారంభించారు. 
 

88

గతేడాది అక్కినేని నాగ చైతన్యతో కలిసి ‘లవ్ స్టోరీ’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత నేచుర్ స్టార్ నాని సరసన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో నటించి తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. ప్రస్తుతం తెలుగులో ఎలాంటి సినిమా అప్డేట్ లేదు. తమిళం మాత్రం ‘గార్గి’లో నటిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories