Kajal: కొడుకు ఫోటోని పంచుకున్న కాజల్‌.. ఎంత క్యూట్‌గా ఉన్నారో.. ఉపాసన ఫిదా.. ఫోటో వైరల్

Published : Jun 20, 2022, 09:10 PM ISTUpdated : Jun 21, 2022, 06:27 AM IST

అందాల చందమామ కాజల్‌ అభిమానులతో తన కొడుకు ఫోటోని పంచుకుంది. బర్త్ డే ఇచ్చిన ఆనందంలో కొడుకుని ముద్దాడుతన్న ఓ క్యూట్‌ ఫోటోని షేర్‌ చేసింది కాజల్‌. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది.

PREV
18
Kajal: కొడుకు ఫోటోని పంచుకున్న కాజల్‌.. ఎంత క్యూట్‌గా ఉన్నారో.. ఉపాసన ఫిదా.. ఫోటో వైరల్

కాజల్‌(Kajal Agarwal) గత నెలలో పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. నీల్‌ అని నామకరణం కూడా చేశారు. అయితే తల్లి అయ్యాక కాజల్‌ మొదటి పుట్టిన రోజుని జరుపుకుంది. ఆదివారం(జూన్‌ 19) కాజల్‌ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. కాజల్‌ ఆనందానికి అవదల్లేవు. ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. 

28

తన కుమారుడు నీల్‌ ఫోటోని అభిమానులతో షేర్‌ చేసింది Kajal. నీల్‌ని ముద్దాడుతున్నట్టుగా ఉన్న కాజల్‌ ఫోటో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రెడ్‌ డ్రెస్‌లో కాజల్‌ మెరిసిపోతుండగా, నీల్‌ ఎంతో క్యూట్‌గా ఉన్నాడు. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట వైరల్ అవుతుంది. అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. Kajal with Neil.
 

38

ఇందులో తన ఆనందాన్ని షేర్‌ చేసుకుంది కాజల్‌. తనకు చాలా స్పెషల్‌గా నిలిచిన బర్త్ డే సందర్భంగా విషెస్‌ చెప్పిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. తన చిన్నారితో ఈ బర్త్ చేసుకోవడం ఎంతో హ్యాపీగా ఉందని తెలిపింది. ఈ ఫోటోకి అభిమానులు ఫిదా అవుతున్నారు. విషెస్‌ తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు. దీనికి ఉపాసన సైతం స్పందించింది. `మోస్ట్ అడోరబుల్‌` అంటూ పోస్ట్‌ పెట్టి లవ్‌ ఎమోజీలను పంచుకుంది.

48

మరోవైపు కాజల్‌ భర్త గౌతమ్‌ కిచ్లు పిక్ ని సైతం షేర్‌ చేసింది కాజల్‌. ఇందులో తన కుమారుడిని ఎత్తుకుని తండ్రి అయినా అనుభూతిని అస్వాధిస్తున్నారు. అంతేకాదు ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఆయన తండ్రి అయ్యాక జరుపుకుంటున్న తొలి ఫాదర్స్ డే కావడంతో తమకు ఎంతో స్పెషల్‌గా ఉందని తెలిపింది కాజల్‌. ఫాదర్స్ డే విషెస్‌ చెప్పింది.

58

కాజల్‌ తన బర్త్ డే సందర్భంగా ఫ్రెండ్స్,ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ముందు రోజే పార్టీ చేసుకున్నారు. లాంచ్‌, డిన్నర్‌ డేట్‌ అంటూ ఆమె పంచుకున్న ఫోటోలు సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. 

68

తల్లి అయిన తర్వాత కాజల్‌ నెమ్మదిగా పూర్వ వైభవాన్ని పొందుతుంది. ఆమె ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది. అంతకు ముందు కంటే ఇప్పుడే కాజల్‌ మరింత హాట్‌గా కనిపించడం విశేషం. తరగని అందం కాజల్‌ సొంతం అని చాటుకుంటోంది. 
 

78

కాజల్‌ ఇటీవల డెలివరీ తర్వాత ఫోటో షూట్లు నిర్వహించింది. ఆద్యంతం హాట్‌గా, సెక్సీగా ఉన్న ఆమె ఫోటో షూట్‌ పిక్స్ ఆద్యంతం కనువిందు చేశాయి. అభిమానులను ఆకట్టుకుంటూ వైరల్‌ అయ్యాయి. చూడబోతుంటే మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు సిగ్నల్‌ ఇస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 

88

కాజల్‌ చివరగా `హే సినామికా` చిత్రంలో నటించింది. తమిళంలో రూపొందిన చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయగా, ఇది పరాజయం చెందింది. మరోవైపు చిరంజీవితో `ఆచార్య`లోనూ ఆమె నటించగా, చివరి నిమిషంలో ఆమె పాత్రని తొలగించారు. దీంతో కాజల్‌ నటించిన తెలుగు చివరి చిత్రంగా `మోసగాళ్లు` నిలిచింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories