అనసూయ టాలీవుడ్ లో అందమైన యాంకర్ గా చాలా కాలం రాణించింది. అలాగే వెండితెరపై విలక్షణ నటిగా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తోంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది.
రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పెదకాపు చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. వాస్తవానికి అనసూయ సినిమాలలో ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడం వల్లే బుల్లితెరకి దూరం అయింది అనే ప్రచారం కూడా ఉంది.
అనసూయ అంటే గ్లామర్ మాత్రమే కాదు.. వివాదాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు నెటిజన్లు అనసూయని అకారణంగా ట్రోల్ చేయడం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా మరికొన్నిసార్లు అనసూయ తనంతట తాను వివాదాల్లో చిక్కుకోవడం చూస్తూనే ఉన్నాం. నెటిజన్లు ఆంటీ అని ట్రోల్ చేయడంతో అనసూయ చాలా బాధపడింది.
అయితే ఆంటీ అనే పదం వల్ల తాను ఎందుకు బాధ పడ్డానో.. తనని అలా పిలవడం ఎందుకు నచ్చడం లేదో అనసూయ వివరించింది. అనసూయ మాట్లాడుతూ.. ఇంట్లో ఉండి పిల్లలని చూసుకోవచ్చు కదా.. ఎందుకు ఆంటీ మీకు ఇవన్నీ అని ఎలా పడితే అలా మాట్లాడతారు. అసలు ఆంటీ అంటే ఎందుకు మీకు నచ్చదు అని యాంకర్ ప్రశ్నించగా.. ఆంటీ అనేది తప్పు కాదు అని అనసూయ తెలిపింది.
కానీ నాపై ఆ పదాన్ని వల్గర్ గా వాడతారు. మల్లు ఆంటీ అంటే ఎంత అసభ్యంగా ఉంటుంది. అదే విధంగా నన్ను కూడా అదో రకమైన బ్యాడ్ ఫీలింగ్ తో పిలుస్తారు. నా పిల్లల ఫ్రెండ్స్ నన్ను ఆంటీ అని పిలిస్తే చాలా క్యూట్ గా ఉంటుంది. వాళ్ళు చాలా గౌరవంగా, ప్రేమతో ఆంటీ అని పిలుస్తారు. కానీ ఎవరో ఊరు పేరు తెలియని వాళ్ళకి నేను ఎలా ఆంటీ అవుతాను.
కారణం ఏదైనా కానీ వాళ్ళు ఆంటీ అని పిలవడం నాకు నచ్చడం లేదు. అయినా కూడా నేను బాధపడే విధంగా పదేపదే అదే పదంతో ఎందుకు పిలవాలి ?అది పైశాచిక ఆనందం కాదా అని అనసూయ ప్రశ్నించింది. దూరంగా ఉన్న నాపైనే వీళ్ళు ఇంత హెటేడ్ గా ఉంటే.. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళ పట్ల ఇంకెలా ఉంటారు. ఇలాంటి వారే భవిష్యత్తులో రేపిస్టులుగా మారుతారు అంటూ అనసూయ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది.