Intinti Gruhalakshmi: పండుగలో తులసి, సామ్రాట్ ల హడావిడి.. మొఖం మాడ్చిన అనసూయ!

First Published Oct 11, 2022, 10:18 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు అక్టోబర్ 11వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..లాస్య, నందులు సినిమా పేరు చెప్పబోయి ఓడిపోతారు. దాని తర్వాత పరంధామయ్య, అనసూయలు ఆ పోటీలో పాల్గొంటారు. ఎంతో ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు ఓడిపోతారు. దాని తర్వాత ఇంక శృతి, ప్రేమ్ మాత్రమే మిగిలిపోయారు. అప్పుడు తులసి శృతి తో, మీరు అన్యోన్య దంపతులను నాకు తెలుసు అమ్మ కచ్చితంగా గెలుస్తారు అసలకే లవ్ మ్యారేజ్ కూడా కదా అని అనగా, మీరు మా దగ్గర ఎక్కువ ఆశిస్తున్నారు ఆంటీ అని శృతి చెప్తుంది.ఇద్దరూ వెళ్లి ఆట మొదలుపెట్టేసరికి ప్రేమ్ సినిమా పేరు చిన్న సైగ చేసిన వెంటనే శృతి దాన్ని పట్టి జవాబు ఇస్తుంది. అప్పుడు ప్రేమ్ మనసులో, చిన్న సైగ చేస్తేనే నేనేం చెప్పాలనుకున్నానో నువ్వు అర్థం చేసుకున్నావు నా మనసులో ప్రేమ నీకు అర్థం కావడం లేదా అని అంటాడు.దానికి శృతి మనసులో, చిన్న సైగతోనే ఇంత బాగా చెప్తున్నావు కానీ మనసులో ఉన్న ప్రేమను ఎందుకు నటిస్తున్నావు అని అంటుంది. అక్కడున్న యాంకర్ అన్యోన్య దంపతులు ఇద్దరికీ శుభాకాంక్షలు అని చెప్పి కానుకలు ఇస్తుంది.
 

ఆ తర్వాత యాంకర్,ఇంకో రౌండ్ ఉన్నాది.ఇది కూడా భార్యాభర్తల మధ్య జరిగే గేమే. భర్తలు కళ్లకు గంతులు కట్టుకొని భార్య చెప్పిన దిక్కులువైపు వెళుతూ ఆ బాల్ ని బుట్టలో వెయ్యాలి అనీ,దీన్ని బట్టి ఎవరు అన్యోన్య దంపతులు తెలుస్తుంది అని అనగా, ముందు శృతి ప్రేమ్ లు ట్రై చేస్తారు కానీ ఓడిపోతారు. దాని తర్వాత నందు, లాస్యలను వెళ్తారు. అప్పుడు పరంధామయ్య, వీళ్ళు ఓడిపోవడం ఖాయం అని అంటారు. దానికి అనసూయ, లాస్య కచ్చితంగా గెలుస్తుంది అని అంటుంది. ఈ మాటలు విని లాస్య, చూసావా నందు మనం కచ్చితంగా గెలవాలి అని అంటుంది.అప్పుడు లాస్య చెప్తున్నా డైరెక్షన్స్ బట్టి నందు బాల్ ని వేయాలని చూస్తాడు కానీ ఓడిపోతాడు. దాని తర్వాత ఇంక అభి, అంకితలే మిగిలి ఉన్నారు అని వాళ్ళిద్దరూ వెళ్తారు. మేము కచ్చితంగా ఓడిపోతాము అని అంకిత అనగా, లేదు అంకిత నీ మాటలను అభి వింటే జీవితంలో ఎదుగుతాడని నాకు నమ్మకం ఉన్నది అని తులసి అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ వెళ్లి ఆడగా అంకిత చెప్పిన డైరెక్షన్స్ ఫాలో అవుతూ అభి బాల్ ని బుట్టలో వేస్తాడు. అప్పుడు తులసి, ఇదే మీ జీవితం అనుకోండి నీకు అర్థమైంది కదా అభి అంకిత చెప్పినట్టు నువ్వు చేస్తే జీవితంలో ఎత్తుకు ఎగురుతావు.
 

 అంకిత తెలివైనది మీరు ఎప్పుడు ఇలాగే అన్యోన్యంగా ఉండాలి అని అంటుంది. ఇంతలో సామ్రాట్ అక్కడికి వస్తాడు. సామ్రాట్ రావడం చూసి, హమ్మయ్య వచ్చాడు అని లాస్య ఆనందపడుతూ ఉంటుంది. కానీ అనసూయ ముఖం మాత్రం మాడిపోతుంది. అప్పుడు సామ్రాట్ అక్కడికి రాగా తులసి ఆనందంతో అక్కడికి వెళ్తుంది. ఇంతలో అనసూయ తులసిని ఆపి, తులసి చుట్టుపక్కల అందరూ ఉన్నారు ఇది ఇల్లు కాదు జాగ్రత్తగా వెళ్ళి మాట్లాడు అని అనగా, తులసి అక్కడికి వెళుతుంది.అప్పటికే సామ్రాట్ హనీ దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఎలాగున్నాదమ్మా అయినా ఏంటి తులసి గారు మీ మీద బాధ్యతతో హనీ నీ ఇక్కడికి పంపించాను పాపం కడుపునొప్పి అని నాకు ఫోన్ చేసింది. మీ అందరికీ ఫోన్ చేసినా ఎత్తడం లేదు. నేను ఎంత నరకం అనుభవించానో తెలుసా అని అనగా, హనీకి కడుపు నొప్పి పెట్టిందా కనీసం నాకు చెప్పను కూడా లేదు.ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాము బానే ఉన్నది ఏమైందమ్మా అని అనగా హనీ,నాకే నొప్పి లేదు నేను ఊరికినే నాన్నని పిలిచాను. ఇక్కడ అందరూ ఆనందంగా ఆడుకుంటే నాన్న ఒకరే ఇంట్లో కూర్చుని ఉన్నారు.
 

అందుకే బాధేసి పిలిచాను అని అనగా సామ్రాట్ హనీ ని తిట్టబోగా వాళ్ళ బాబాయ్ వచ్చి, నీ మంచి కోసమే కదరా అబద్ధం ఆడింది వదిలేయని ఊరుకో పెడతాడు. అప్పుడు సామ్రాట్, నాకు ఆఫీస్ పని ఉన్నదని చెప్పాను కదా నేను బయలుదేరుతాను అని అనగా, ఇంట్లో వాళ్ళందరూ బలవంతం పెట్టి,ఇక్కడ వరకు వచ్చారు కదా లోపలికి రండి. అవి ఎప్పుడు ఉండేవే కదా ఇది ఎప్పుడో ఒకసారి ఉంటుంది అని బలవంతంగా లోపల ఉంచేస్తారు. అప్పుడు అనసూయ ముఖం మాడుస్తుంది.ఇంతలో చివరి రౌండ్ మొదలవుతుంది.
 

అందరూ కోలాటాలు ఆడాలి,ఎవరైతే ఎక్కువసేపు కోలాటాలు ఆడుతూ చివరి వరకు ఉంటారో వాళ్ళే గెలిచినట్టు అని అనగా, ఇంట్లో వాళ్ళందరూ కోలాటం ఆడడం మొదలుపెడతారు. నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు అలిసిపోతూ ఉండగా చివరికి లాస్య,నందు, సామ్రాట్, తులసి లు మిగులుతారు. కొంచెం సేపటికి నందు,లాస్య లు కూడా అలసిపోయి ఆగిపోతారు. కానీ సామ్రాట్,తులసిలు అలాగే కోలాటం చేస్తూనే ఉంటారు. అప్పుడు సామ్రాట్ తులసి తో, అలసిపోతారు ఆగండి అని అనగా, నేను చివరి వరకు ఆగను ఎలాగైనా గెలుస్తాను అని అంటుంది తులసి.
 

నేను ఆగిపోతాను అయితే మీరు అలిసిపోతున్నారు అని అంటాడు సామ్రాట్. దానికి తులసి,మీరు జాలి చూపించి నన్ను గెలిపిస్తే అది నా గెలుపు అవ్వదు అని అంటుంది. అలాగా కొంచెం సేపు కోలాటం ఆడిన తర్వాత సామ్రాట్ అలిసిపోయి ఆగిపోతాడు. అప్పుడు తులసి గెలుస్తుంది. అప్పుడు యాంకర్,తులసి గారు గెలిచినందువలన ఈ కాలనీ ప్రెసిడెంట్ గారి చేత గిఫ్ట్ అందుకుంటారు అని అంటుంది యాంకర్.అక్కడున్న మహిళలు తులసిని ఆపి, ఆవిడకు బహుమతి తీసుకునే అధికారం లేదు.
 

స్త్రీ అంటే అన్యోన్యంగా పద్ధతిగా ఉండాలి ఇలాగ విరగబడి ఉండకూడదు అని అంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!