అనసూయ ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్స్ చేసినా నెటిజెన్స్ ఇరిటేట్ చేస్తున్నారు. నెగిటివ్ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఆంటీ అంటూ సోషల్ మీడియా వేధింపులకు దిగిన వారిపై అనసూయ ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు. కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ఆధారాలుగా ఇచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు పెట్టినా, హెచ్చరించినా నెటిజెన్స్ భయపడ్డ సూచనలు కనిపించడం లేదు.