Anasuya: పెళ్లికి ముందే రిలేషన్‌షిప్‌లో అనసూయ.. ఎనిమిదేళ్లల్లో అది మాత్రం అడగలేదట.. టీవీ షోస్‌పై క్లారిటీ!

First Published | Sep 21, 2023, 4:36 PM IST

యాంకర్‌ అనసూయ.. ఇప్పుడు సినిమాలకే పరిమితమైంది. అయితే కాంట్రవర్సీలతో సోషల్‌ మీడియాలో, లేదంటే సినిమాల్లో కనిపిస్తుంది. తాజాగా ఆమె తన సహజీవనం మ్యాటర్‌ బయటపెట్టింది. 
 

టీవీ నుంచి సినిమాల్లోకి వచ్చింది అనసూయ. ఆమె టీవీ న్యూస్‌ ప్రజెంటర్‌గా, అట్నుంచి టీవీ యాంకర్‌గా మారారు. `జబర్దస్త్` షో ద్వారా పాపులర్‌ అయ్యింది. దాదాపు 9ఏళ్లపాటు యాంకరింగ్‌ చేసి గతేడాది దాన్ని వదిలేసింది. ఇప్పుడు పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యింది. మంచి ఎగ్జైటింగ్‌ షోస్‌ వస్తే చేస్తానని చెబుతుంది.  
 

యాంకర్‌గా టర్న్ తీసుకున్న సమయంలోనే అనసూయ పెళ్లి చేసుకుంది. ఆమె సుశాంక్‌ భరద్వాజ్‌ని వివాహం చేసుకుంది. 2010లో వీరి వివాహం జరగ్గా వీరికి ఇద్దరు కుమారులున్నారు. తన భర్తతో ఎంతో అన్యోన్యంగా ఉంటుంది అనసూయ. ఖాళీ టైమ్‌ దొరికితే భర్త, పిల్లలతో కలిసి వెకేషన్‌కి వెళ్తుంది. ఎంజాయ్‌ చేస్తుంటుంది. ఇటీవల వెకేషన్‌లో బికినీలోనూ సర్‌ప్రైజ్‌ చేసిన విషయం తెలిసిందే. 


ఇదిలా ఉంటే తన మ్యారేజ్‌కి సంబంధించిన ఒక క్రేజీ సీక్రెట్‌ని బయటపెట్టింది అనసూయ. బిహార్‌కి చెందిన సుశాంక్‌ భరద్వాజ్‌తో ఎనిమిదన్నరేళ్లపాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారట. తాము సహజీవనం చేసిన తర్వాతనే పెళ్లి చేసుకున్నామని తాజాగా వెల్లడించింది. అయితే ఈ క్రమంలో తమ మధ్య ఎప్పుడూ `నీదే కులం` అనే ప్రస్తావన రాలేదట. పెళ్లి టైమ్‌లో వెడ్డింగ్‌ కార్డ్స్ సమయంలో ఆ విషయం తెలిసిందని పేర్కొంది అనసూయ. 
 

పెళ్లి కొత్తలో వాళ్ల సాంప్రదాయాల విషయంలో కొంత ఇబ్బంది పడినట్టు తెలిపింది. అక్కడి సాంప్రదాయం ప్రకారం డ్రెస్‌ నిండుగా కప్పుకోవాలని, కొంగు కూడా ముఖానికే కప్పుకొనే భోజనం చేయాల్సి ఉంటుందని, అయితే ఆ తర్వాత ఇరు ఫ్యామిలీస్‌ మ్యూచ్వల్‌ అండర్‌స్టాండింగ్‌గా వాటిని ఓవర్‌ కమ్‌ చేశానని, ఇప్పటికీ కొన్ని పాటిస్తానని తెలిపింది. అయితే చాలా వరకు వారిని తాను వాష్‌ చేస్తానని పేర్కొందీ హాట్‌ యాంకర్‌. కులం అనే దానికి తాను ప్రయారిటీ ఇవ్వనని వెల్లడించింది. 
 

అనసూయ ప్రస్తుతం `పెదకాపు-1` చిత్రంలో నటించింది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రమిది. `అఖండ` ఫేమ్‌ ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అనసూయ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన సహజీవనం మ్యాటర్‌ బయటపెట్టింది. ఇందులో తనది చాలా బలమైన పాత్ర అని, `రంగస్థలం`లో రంగమ్మత్త పాత్రని ఎలా అయితే గుర్తుపెట్టుకుని ఇప్పటికీ అలానే పిలుస్తున్నారో, ఈ సినిమా తర్వాత కూడా తన పాత్ర పేరు గుర్తిండిపోతుందని తాను భావిస్తున్నట్టు చెప్పింది. 
 

తాను బలమైన పాత్రలకే ప్రయారిటీ ఇస్తానని, కంప్లీట్‌గా సాటిస్ఫాక్షన్‌ ఇచ్చే పాత్రలు, అలాంటి సినిమాలే చేస్తానని తెలిపింది. అలాంటి పాత్రలు వస్తే అమ్మమ్మగా నటించడానికైనా సిద్ధమే అని వెల్లడించింది. మరోవైపు ఇటీవల సోషల్‌ మీడియాలో ఏడుస్తూ వీడియో పోస్ట్ చేయగా, అది ట్రోల్స్ కి కారణమైంది. దానిపై అనసూయ స్పందిస్తూ తాను పెట్టిన పోస్ట్ అర్థం కాలేదని, అందుకే అలా రియాక్ట్ అయ్యారని, మరోసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

తన జీవితంలో కన్నీళ్లు కూడా ఉన్నాయని, అయినా అక్కడే ఆగిపోనని, ముందుకు సాగుతానని అందరి లైఫ్‌ అంతే అని, వాటిని దాటుకుని ముందుకు వెళ్లిపోవాలని, అందరి జీవితంలోనూ కన్నీళ్లుంటాయనేది తన ఉద్దేశమని వెల్లడించింది అనసూయ. మరోవైపు టీవీ షోస్‌ తనకు కూడా చేయాలని ఉందని, మంచి ఎగ్జైటింగ్‌ గా అనిపిస్తేనే చేస్తానని, ఆఫర్లు వస్తున్నాయని, ఈటీవీతో ఓ షోకి అడుగుతున్నారని తెలిపింది. 

Latest Videos

click me!