హీరోయిన్ గా సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది నయనతార. సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అంతే కాదు సౌత్ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది బ్యూటీ. హీరోయిన్ల కెరీర్ టైమ్ మహా అయితే 30.. అది దాటితే.. 35 వరకూ నెట్టుకుని వచ్చేవారు ఉన్నారు. కాని 40 ఏళ్ళు వస్తున్నా.. హీరోయిన్ గా అదే డిమాండ్ తో దూసుకుపోతోంది నయనతార.