నటి, యాంకర్ అనసూయ తరచుగా వార్తల్లో, వివాదాల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో నిత్యం ఏదో విధంగా అనసూయ గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. అనసూయ బుల్లితెర యాంకర్ గా, వెండితెరపై నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన గ్లామర్ తో అనసూయ ఇంకా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో అనసూయకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
DID YOU KNOW ?
రంగస్థలంలో రంగమ్మత్త
రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో నటించే అవకాశం ముందుగా సీనియర్ హీరోయిన్ రాశికి వచ్చింది. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో సుకుమార్ ఆ ఆఫర్ ని అనసూయకి ఇచ్చారు.
25
తన డ్రెస్సింగ్ ని విమర్శించే వారికి అనసూయ కౌంటర్
అదే సమయంలో అనసూయ వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటుంది. ఆమె డ్రెస్సింగ్ గురించి తరచుగా విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో కొందరు మహిళలే తనని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు అని అనసూయ తాజాగా స్పందించింది. తనని, తన డ్రెస్సింగ్ విధానాన్ని విమర్శించే వారికీ అనసూయ సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తూ పోస్ట్ పెట్టింది.
35
మహిళలే నన్ను టార్గెట్ చేస్తున్నారు
ఇటీవల నాపై ఎవరు కామెంట్స్ చేస్తున్నప్పటికీ మౌనం వహిస్తున్నాను. కానీ నేను జీవిస్తున్న విధానంపై విమర్శలు పెరిగాయి. దీనితో స్పందించక తప్పడం లేదు. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో కొందరు నన్ను టార్గెట్ చేస్తూ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. కొందరు మహిళలే నన్ను విమర్శిస్తున్నారు. వాళ్లెవరో నాకు తెలియదు. వారితో నాకు పరిచయం లేదు. అయినప్పటికీ నా వ్యక్తిత్వంపై కామెంట్స్ చేస్తున్నారు. నేను ధరిస్తున్న బట్టల ఆధారంగా నా వ్యక్తిత్వంపై కామెంట్స్ చేస్తున్నారు.
అవును నేను మహిళని, భార్యని, ఇద్దరు పిల్లలకు తల్లిని. నా స్టైల్ కి తగ్గట్లుగా బట్టలు ధరించడాన్ని నేను ఆస్వాదిస్తాను. అందం, స్టైల్, కాన్ఫిడెన్స్ అనేవి నా గుర్తింపులో భాగం అయ్యాయి. నేను ధరిస్తున్న బట్టల ఆధారంగా నేను తల్లిలా బిహేవ్ చెయ్యట్లేదు అని కొందరు విమర్శిస్తున్నారు. వాళ్ళకి నాదొక ప్రశ్న. తల్లి అయితే లైఫ్ లో మిగిలినవి అన్నీ వదిలేయాల్సిందేనా ?
55
నా భర్త, పిల్లలు నన్ను జడ్జ్ చేయరు
నా భర్త, పిల్లలు నన్ను ప్రేమిస్తారు. నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్లెప్పుడూ నన్ను జడ్జ్ చేయలేదు. నాకు నచ్చిన బట్టలు ధరిస్తున్నాను అంటే విలువలు కోల్పోయినట్లు కాదు. నాలాగా ఉండమని నేను ఎవ్వరికీ చెప్పను. నాకు నచ్చినట్లు బ్రతికే స్వేచ్ఛ నాకు ఉంది. మీకు నచ్చినట్లు మీరు ఉండండి అంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్ చేసింది.