Anasuya Without Makeup: అనసూయ మేకప్ లుక్‌లో అదిరిపోయే ఫోటోలతో ఆకట్టుకుంటుంది. కానీ మేకప్ లేకుండా కనిపించడం చాలా అరుదు. ఇప్పుడు ఆమె మేకప్ లేకుండా కనిపించి షాకిస్తుంది.
Anasuya Without Makeup: మాజీ యాంకర్, ప్రస్తుతం నటిగా సెటిల్ అవుతున్న అనసూయ ఒకప్పుడు గ్లామర్ లుక్‌లో కనిపించి ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో రచ్చ చేసింది. నెటిజన్లకి నిత్యం టచ్‌లో ఉంటూ మెస్మరైజ్ చేసింది. కానీ ఇటీవల అన్నీ తగ్గించింది. ఆమె జబర్దస్త్ మానేయడంతో ఆ క్రేజ్ తగ్గిపోయింది.
యాంకర్‌గా చేసినప్పుడు, ఆమె ఫోటో షూట్ పిక్స్ పంచుకున్నప్పుడు సోషల్ మీడియాలో తరచూ ఆమెకి సంబంధించిన చర్చ నడిచేది. పాజిటివ్‌గా, నెగటివ్‌గా ఉండేది. కానీ ఇప్పుడు టీవీలో యాక్టివ్‌గా లేకపోవడం, పైగా గ్లామర్ ఫోటోలు పంచుకోకపోవడంతో ఆమె గురించిన చర్చ తగ్గిపోయింది. అడపాదడపా టీవీల్లో కనిపించినా, ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె మేకప్ లేని ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మేకప్ లుక్‌లో అదరగొడుతుంది. అదిరిపోయేలా ఉంటుంది. ఆమె అందానికి నెటిజన్లు రియాక్ట్ అవుతూ కామెంట్లు పెడుతుంటారు. రచ్చ చేస్తుంటారు. కానీ మేకప్ లేకపోతే ఆ రచ్చ వేరే లెవల్‌లో ఉంటుంది. ఇటీవల ఆమె మేకప్ లేకుండా కనిపించి ఆశ్చర్యపరిచింది.
ఒరిజినల్ లుక్‌లో తను ఎలా ఉంటుందో చూపించింది. అడపాదడపా ఆమె తన రియల్ లుక్‌ని చూపిస్తుంది. కానీ ఇప్పుడు ఆమె కనిపించిన తీరు మాత్రం వేరే లెవెల్. ఇందులో ముఖంపై కొన్ని నల్లటి మచ్చట్లు కనిపిస్తున్నాయి. వాటిని పట్టుకుంటున్నారు నెటిజన్లు. సెటైర్లు, మీమ్స్ తో ఆటపట్టిస్తున్నారు.
అయితే చాలా వరక మేకప్ లేకపోయినా బాగుందని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అనసూయ మేకప్ లేకపోతేనే చాలా రొమాంటిక్‌గా ఉంటుందని అంటున్నారు. అయితే గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవాళ్లు చాలా వరకు మేకప్‌లోనే కనిపిస్తారు. వితౌట్ మేకప్ కనిపించే సాహసం చేయరు.
కానీ అనసూయ అవేమీ పట్టించుకోదు. తనకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటుంది. అందులో కూడా తన ఆనందాన్ని వెతుక్కుంటుంది. అలా కూడా తన అభిమానులను అలరించాలనుకుంటుంది. పాజిటివ్ యాంగిల్‌లోనే ఆమె ఫోటోలను పంచుకుంటుంది.
కానీ కొన్నిసార్లు అవి ట్రోలింగ్‌కి గురవుతుంటాయి. కాకపోతే ఇలాంటివి గతంలో చాలా జరిగాయి. అనసూయ కూడా లైట్ తీసుకుంటుంది. సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఏదైనా తన గురించి మాట్లాడుకుంటున్నారు కదా అదే చాలు అనే భావిస్తుంటుంది. అయితే ఇప్పుడు నెటిజన్లు కూడా పట్టించుకోవడం లేదు. ఇదే అనసూయ క్రేజ్ తగ్గిందనడానికి నిదర్శనం.
మరోవైపు సినిమాలు కూడా రావడం లేదు. ఒకప్పుడు బిజీగా ఉన్నా, ఇప్పుడు ఏడాది ఒకటి రెండు తప్పితే పెద్దగా రావడం లేదు. ఇటీవల `పుష్ప 2`లో మెరిసిన విషయం తెలిసిందే. దీంతో అనసూయ లైమ్ లైట్ నుంచి తగ్గిపోతుంది. ఆమె సైడ్ అయిపోతుంది. ఆమెపై చర్చ లేదు, ఆమెపై ట్రోల్స్ లేవు. అంతా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం తాను చాలా సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయని ఆమె చెబుతుంది, కానీ ఆఫర్లు లేవని ఆడియెన్స్ అనుకుంటున్నారు. ఏదేమైనా మునుపటి క్రేజ్ మాత్రం అనసూయకి లేదనేది నిజం.
తాజాగా ఆమె పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించింది. `హరిహర వీరమల్లు` చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. శుక్రవారం ఈ సాంగ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో పూజిత పొన్నాడతో కలిసి కనిపించింది అనసూయ. పవన్ తో ఈ స్పెషల్ సాంగ్‌లో అనసూయ గ్లామరస్‌గా కనిపించబోతుందని ఆమె లుక్‌ని చూస్తుంటే తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు పాట ద్వారా అలరించబోతుంది, అది కూడా పవన్ తో కలిసి కావడం విశేషం.
`కొల్లగొట్టినాదిరో` అంటూ సాగే ఈ పాటని సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయబోతున్నారు. అనసూయ ఇలా స్పెషల్ సాంగ్ చేస్తుందంటే ఆమె రేంజ్ తగ్గిందని అంటున్నారు నెటిజన్లు. మరి అనసూయ నిరూపించుకునే టైమ్ వచ్చింది. మరి ఈ మూవీతో అయినా పుంజుకుంటుందా? పూర్వ వైభవం పొందుతుందా అనేది చూడాలి.
read more: ఒకప్పుడు ఐటమ్ గర్ల్స్ , ప్రస్తుతం గౌరవంగా బ్రతుకుతున్న స్టార్స్ ఎవరో తెలుసా?
also read: `ఛావా` సినిమాపై ప్రధాని మోడీ కామెంట్, దేశం మొత్తం ఇప్పుడు అదే పని