నిన్న సన్నిహకే, హైడ్ అండ్ సీక్, ది జడ్జ్‌మెంట్, పౌడర్, కాలాప్థర్ సినిమాలలో ధన్య రామ్ కుమార్ నటించారు. ప్రస్తుతం ఎల్లా నినగగి సినిమా షూటింగ్ చేస్తున్నారు. ధన్య రామ్ కుమార్ గురించి చెప్పాలంటే ఆమె కన్నడ లెజెండ్రీ నటుడు డాక్టర్ రాజ్ కుమార్ మనవరాలు. రాజ్ కుమార్ కుమార్తె పూర్ణిమ కూతురు ఆమె. అంటే శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ ఆమెకి మావయ్యలు అవుతారు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫస్ట్ హీరోయిన్ ధన్యనే.