మరీ ముఖ్యంగా మన తెలుగులో చిరంజీవి రుస్తుం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. బాలకృష్ణతో బలే తమ్ముడు, జగపతి బాబుతో సందడే సందడి లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. కాకపోతే తెలుగులో హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె ఎక్కువ సినిమాలు చేసింది.
ఇక ఊర్వశి తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్, విజయ్ కాంత్, మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి, కన్నడాలో విష్షువర్దన్, రాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోల సరసన మెరిసింది. ఇక హిందీలో కూడా ఓ సినిమా చేసిన ఊర్వశీ..ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది.