ఆ వ్యాధితో బాధపడుతున్న అనసూయ.. మరీ ఇంత వెటకారమా, ఆ వీడియోపై దారుణంగా ట్రోలింగ్

Published : Jan 14, 2023, 07:29 PM IST

అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో.. అదే స్థాయిలో ఆమెని వివాదాలు కూడా చుట్టుముడుతుంటాయి. 

PREV
16
ఆ వ్యాధితో బాధపడుతున్న అనసూయ.. మరీ ఇంత వెటకారమా, ఆ వీడియోపై దారుణంగా ట్రోలింగ్

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. తాజాగా అనసూయ మరోసారి నెటిజన్లకు సర్ప్రైజ్ ఇచ్చింది.  బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. 

26

రంగస్ధలంలో రంగమ్మత్తగా ఆకట్టుకున్న అనసూయ.. పుష్పలో దాక్షాయణి గా అదరగొట్టింది. డీ గ్లామర్ రోల్ లో సైతం మెప్పించింది. అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో.. అదే స్థాయిలో ఆమెని వివాదాలు కూడా చుట్టుముడుతుంటాయి. 

36

వెటకారం అన్ని సందర్భాల్లో పనిచేయదు. ఇటీవల అనసూయ పోస్ట్ చేసిన ఇన్స్టా రీల్ వీడియోనే అందుకు నిదర్శనం. అనసూయపై కొందరు ఆకతాయిలో సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. వాళ్ళకి అనసూయ కూడా ధీటుగా జవాబు చెప్పడం చూస్తూనే ఉన్నాం. అయితే ఆ మధ్యన అనసూయని 'ఆంటీ' అని సంబోధిస్తూ పెద్దఎత్తున ట్రోలింగ్ చేశారు. 

46

అప్పటి నుంచి అనసూయ ఇంకాస్త ఘాటుగా ప్రవర్తించడం ప్రారంభించింది. తాజాగా అనసూయ .. తాను ఓ వ్యాధితో (డిజార్డర్)తో బాధపడుతున్నట్లు వీడియోలో పేర్కొంది. దీనితో క్షణం పాటు నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే వెటకారంగా మాత్రమే అనసూయ తనకి వ్యాధి ఉన్నట్లు పేర్కొంది. 

56

నిజాలు మాత్రమే మాట్లాడే వ్యాధి ఉంది. అలాగే నా గురించి నెగిటివ్ గా మాట్లాడే వారిని అస్సలు పట్టించుకోను. ఇదే నా వ్యాధి అంటూ అనసూయ వెటకారంగా వీడియోలో పేర్కొంది. అనసూయ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా తనకి వ్యాధి ఉంది అంటూ వెటకారం చేస్తారా.. ఇంత అతి అవసరమా అని కామెంట్స్ పెడుతున్నారు. 

66

గ్లామర్ పరంగా అనసూయ యువతకి ఎలా చెమటలు పట్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చీరకట్టినా, మోడరన్ డ్రెస్ లో మెరిసినా అనసూయ అందానికి కుర్రాళ్లు మైమరచిపోవాల్సిందే. యాంకర్ గా, నటిగా ఈ రేంజ్ లో పాపులర్ కావడంఅనసూయకే సాధ్యం అయింది. 

click me!

Recommended Stories