‘పటాస్ 2’, ‘కామెడీ స్టార్స్’, ‘సిక్త్ సెన్స్ సీజన్ 4’ ‘భలే ఛాన్సులే’, ‘ఢీ’ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి టీవీ ఆడియెన్స్ లో గుర్తింపు దక్కించుకుంది. అలాగే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపైనా మెరుస్తోంది. గతేడాది ‘మళ్లీ మొదలైంది’ చిత్రంతో అలరించింది. ప్రస్తుతం సమంత నటించిన ‘శాకుంతలం’లో కీలక పాత్ర పోషిస్తోంది.