రవితేజని అలా చూడగానే గ్లిజరిన్‌ వాడకుండానే కన్నీళ్లొచ్చాయి.. వాల్తేర్‌ వీరయ్యలోని సీన్‌ గుర్తు చేసుకున్న చిరు

Published : Jan 14, 2023, 07:20 PM ISTUpdated : Jan 14, 2023, 09:55 PM IST

`వాల్తేర్‌ వీరయ్య` సినిమాలో రవితేజ, తన మధ్య చోటు చేసుకున్న ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని బయటపెట్టారు చిరంజీవి. స్లేజ్‌పైనే రవితేజపై చేయి చేసుకున్నారు.   

PREV
16
రవితేజని అలా చూడగానే గ్లిజరిన్‌ వాడకుండానే కన్నీళ్లొచ్చాయి.. వాల్తేర్‌ వీరయ్యలోని సీన్‌ గుర్తు చేసుకున్న చిరు

మెగాస్టార్‌ చిరంజీవి, మాస్‌ మహారాజా రవితేజ కలిసి నటించిన `వాల్తేర్‌ వీరయ్య` సంక్రాంతి కానుకగా విడుదలై ఆకట్టుకుంటోంది. సినిమాకి యావరేజ్‌ టాక్‌ వచ్చినా, సంక్రాంతి కావడంతో బాగానే ఆదరణ పొందుతుందని తెలుస్తుంది. కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయని ట్రేడ్‌ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అయితే `వీరసింహారెడ్డి` స్థాయిలో ఈ చిత్రానికి కలెక్షన్లు రాలేదనే టాక్. ఎందుకంటే ఆల్‌రెడీ థియేటర్లలో `వీరసింహారెడ్డి` రన్‌ అవుతుండటంతో కలెక్షన్లు పంచుకోవాల్సి వచ్చింది. అందుకే చిరంజీవి చిత్రానికి కలెక్షన్లు తగ్గాయని అంటున్నారు. 

26

ఇదిలా ఉంటే శనివారం చిత్ర బృందం థ్యాంక్స్ మీట్‌ ఏర్పాటు చేసింది. సినిమా రిజెల్ట్ తేడాగా ఉన్నప్పుడు చిత్ర బృందాలు ఇలా థ్యాంక్స్ మీట్స్ పేరుతో ప్రమోషన్‌ చేస్తుంటారు. సినిమాపై హడావు చేస్తుంటారు. అందరిలాగే మైత్రీ మూవీ మేకర్స్ కూడా అదే చేస్తుంది. ఇక ఈ `వాల్తేర్‌ వీరయ్య` థ్యాంక్స్ మీట్ లో చిరంజీవి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పలు సరదా సన్నివేశాలు క్రియేట్‌ చేశారు. 

36

సినిమా కోసం కష్టపడుతున్న సినీ కార్మికుల కష్టాన్ని ఆయన కెమెరాల్లో బంధించారు. కొన్ని విజువల్స్ ఆయన సొంతంగా తీయడం విశేషం. వాటిని ఓ వీడియో రూపంలో తయారు చేయించారు. తన సినిమా కోసం అసిస్టెంట్లు, కార్మికులు ఎంతగా శ్రమిస్తున్నారో, సినిమా బయటకు రావడం కోసం వాళ్లు ఎంతగా కష్టపడుతున్నారో అనే విషయాన్ని ఆడియెన్స్ కి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ వీడియోని రూపొందించారు. ఈ మీటింగ్‌లో దాన్ని టెలికాస్ట్ చేయగా, అందరిని కదిలిస్తుంది. 

46

మరోవైపు ఇందులో చిరంజీవి మాట్లాడుతూ, దర్శకుడు బాబీ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తెలిపారు. దర్శకుడు అనేవాళ్లు ఎలా ఉండాలో తెలియజేశాడు. దర్శకులందరికి గట్టిగా క్లాస్‌ పీకారు చిరు. నిర్మాత డబ్బుని వృదా చేయోద్దన్నారు. `వాల్తేర్‌ వీరయ్య` కథకి సంబంధించి చాలా వరకు సెట్స్ లోనే ఇంప్రూవ్‌ చేసినట్టు చెప్పారు. క్లైమాక్స్ షూటింగ్‌ కూడా అప్పటికప్పుడు మార్పులు చేసి  షూట్‌ చేశారట. 

56

ఈ సందర్భంగా రవితేజపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రవితేజ తనకు సొంత తమ్ముడిలాంటి వాడని తెలిపారు. సినిమాలో రవితేజ పాత్ర చనిపోయే సమయంలో తనకు నిజంగానే కన్నీళ్లు వచ్చాయన్నారు. ఆ సమయంలో తాను గ్లిజరిన్‌ వాడలేదని, రవితేజ చనిపోతున్న సీన్‌ చూసి తన మనసు కదిలిందని, దీంతో నిజంగానే తాను ఎమోషనల్‌ అయ్యానని తెలిపారు. నిజంగానే అతన్ని బతికించుకోవాలని తాపత్రయపడ్డానని చెప్పారు చిరు. 

66

అంతేకాదు ఈ సందర్భంగా స్టేజ్‌పైనే రవితేజ చెంపపై చేయి చేసుకున్నారు. ప్రేమతో తాను షూటింగ్‌ సమయంలో అలా కొట్టానని చెబుతూ, స్టేజ్‌పై కూడా కొట్టారు. అయితే రవితేజ సరిపోవడం లేదు అన్నయ్య గట్టిగా కొట్టండి అన్నాడని తెలిపారు. అంతేకాదు స్టేజ్‌పై రవితేజని దగ్గరికి తీసుకుని తలని తన భుజాలపై పెట్టుకుని హగ్‌ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది. `వాల్తేర్‌ వీరయ్య` థ్యాంక్స్ మీట్‌ లో ఇది అందరిని ఆకట్టుకుంది.  అయితే సెకండాఫ్‌లో రవితేజ పాత్ర లేకుంటే సినిమాకి ఇంత అందం, ఎలివేషన్‌ వచ్చేది కాదు అని, రవితేజ వల్లే ఇదిసాధ్యమైందన్నారు చిరు.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories