నువ్వు కాలిగోటికి కూడా సరిపోవు... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన అనసూయ, స్టార్ యాంకర్ చేసిన తప్పేంటి?

Published : Jul 09, 2024, 12:09 AM IST

ఓ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది అనసూయ భరద్వాజ్. నువ్వు ఆయన కాలి గోటికి కూడా సరిపోవని ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడ్డారు. ఇంతకీ అనసూయ చేసిన తప్పేంటీ? ఆ వివాదం ఏమిటో చూద్దాం..   

PREV
16
నువ్వు కాలిగోటికి కూడా సరిపోవు... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన అనసూయ, స్టార్ యాంకర్ చేసిన తప్పేంటి?

జబర్దస్త్ కి ముందు అనసూయ అంటే ఎవరో కూడా తెలియదు. ఆమె జీవితాన్ని ఆ కామెడీ షో మార్చేసింది. 2013లో జబర్దస్త్ ప్రయోగాత్మకంగా మొదలైంది. అనూహ్యంగా అనతికాలంలో ఆదరణ తెచ్చుకుంది. పొట్టిబట్టల్లో గ్లామర్ ఒలకబోస్తూ అనసూయ ఇమేజ్ తెచ్చుకుంది. జబర్దస్త్ షోకి అంతకంతకూ ఆదరణ పెరుగుతూ పోయింది. అదే స్థాయిలో అనసూయ క్రేజ్ పెరిగింది. 

 

26

జబర్దస్త్ షో ఆమెకు సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ తెచ్చిపెట్టాయి. కొన్ని సినిమాల్లో అనసూయ లీడ్ రోల్ చేయడం విశేషం. ఏకంగా పవన్ కళ్యాణ్ వంటి స్టార్ పక్కన ఆమెకు ఛాన్స్ వచ్చిందట. అత్తారింటికి దారేది మూవీలోని స్పెషల్ సాంగ్ చేసేందుకు మొదట అనసూయనే దర్శకుడు త్రివిక్రమ్ సంప్రదించాడట. 

36

అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరినీ మెప్పిస్తోంది. గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

46
Anasuya Bharadwaj

పవన్ కళ్యాణ్ మూవీ అంటే విపరీతమైన రీచ్ ఉంటుంది. చిన్న పాత్ర అయినా చేయడానికి నటులు ఆసక్తి చూపుతారు. అనసూయ మాత్రం ఆయనతో కలిసి డాన్స్ చేసే బంపర్ ఆఫర్ వదులుకుందట. ''ఇట్స్ టైం టు పార్టీ నౌ'' సాంగ్ లో సమంత, ప్రణీత సుభాష్ తో పాటు అనసూయ డాన్స్ చేయాల్సి ఉంది. కేవలం నేను మాత్రమే సాంగ్ లో ఉండాలి. మరొక ఇద్దరు హీరోయిన్స్ తో కలిసి డాన్స్  చేయడానికి ఒప్పుకోను అన్నారట. 

 

56

దాంతో అనసూయకి బదులు ఖుషి ఫేమ్ ముంతాన్ ని తీసుకున్నారు. అత్తారింటి దారేది మూవీలోని 'ఇట్స్ టైం పార్టీ నౌ' సాంగ్ విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. కాగా అనసూయ పవన్ కళ్యాణ్ మూవీ ఆఫర్ రిజెక్ట్ చేసిన విషయం తెలిసిన అభిమానులు ఫైర్ అయ్యారు. అనసూయను ట్రోల్ చేశారు. నువ్వు పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా సరిపోవు. ఆయనతో సినిమా చేయనంటావా? అని ఘాటైన కామెంట్స్ తో చుక్కలు చూపించారు. 

 

66
Anasuya Bharadwaj

ఈ విషయాన్ని అనసూయ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది. కాగా రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీలో అనసూయ చేసిన రంగంమ్మత్త పాత్ర మంచి పేరు తెచ్చింది. రంగస్థలం అనంతరం అనసూయకు ఆఫర్స్ పెరిగాయి. విలక్షణ పాత్రలు దక్కుతున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై బిజీ అయ్యాక అనసూయ జబర్దస్త్ వదిలేసిన సంగతి తెలిసిందే. ఇటీవల తిరిగి బుల్లితెర పై సందడి చేస్తుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories