Amardeep : మొత్తానికి కనిపించిన అమర్ దీప్.. ఫ్యాన్స్ నుంచి ఒకే ఒక్క రిక్వెస్ట్!

Published : Dec 28, 2023, 05:52 PM IST

బిగ్ బాస్ తెలుగు 7 రన్నర్ అమర్ దీప్ (Amardeep)  మొత్తానికి సోషల్ మీడియాలో కనిపించారు. తన స్నేహితులతో కలిసి పెట్టిన వీడియో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆయనకు కొన్ని విషయాల్లో రిక్వెస్ట్ లు చేస్తున్నారు.   

PREV
16
Amardeep : మొత్తానికి కనిపించిన అమర్ దీప్.. ఫ్యాన్స్ నుంచి ఒకే ఒక్క రిక్వెస్ట్!

పాపులర్ రియాలిటీ గేమ్ షో Bigg Boss Telugu 7  ఈ ఏడాది ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అన్నీ సీజన్లలో కెల్లా ఈసారి మాత్రం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. మంచి వ్యూయర్షిప్ సంపాదించుకొని సక్సెస్ అయ్యింది. 

26

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ Pallavi Prashanth  టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక సీరియల్ నటుడు, యాక్టర్ అమర్ దీప్ Amardeep  రన్నరప్ గా నిలిచారు. కొద్దిపాటి మద్దతుతో  టైటిల్ ను కోల్పోయాడు. 
 

36

ఇక బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే తర్వాత అమర్ దీప్ పై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రశాంత్ జైలు వరకు వెళ్లి వచ్చాడు. అయితే ఇంత జరుగుతున్నా అమర్ దీప్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. 

46

ఇంతకీ అమర్ దీప్ ఎక్కడా అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో సెర్చ్ మొదలెట్టారు. కానీ బిగ్ బాస్ టైటిల్ ను అనౌన్స్ చేసిన రెండు వారాల తర్వాత తాజాగా కనిపించారు. తన స్నేహితులతో కలిసి న్యూ ఈయర్ New Year సెలెబ్రేషన్స్ కు వెళ్లాడు. 

56

ఈ సందర్భంగా తన స్నేహితురాలు అరియానా గ్లోరీతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు. దీంతో అభిమానులు ఖుషీ అయ్యారు. ఫొటోలను పంచుకున్నారే గానీ తన గురించి కానీ, బిగ్ బాస్ విషయాలపై స్పందించలేదు. 

66

ఇదిలా ఉంటే.. అమర్ దీప్ కు ఫ్యాన్స్ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నారు.  అమర్ దీప్ మీరు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉండాలని కోరుతున్నారు. మీరే నిజమైన విజేత అంటూ మద్దుతునిస్తున్నారు. నార్మల్ గా ఉంటూ.. తమను అలరించాలని కోరుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories