అనసూయ చీరకట్టులో ఏం మాయ దాగుందో.. మత్తెక్కించే ఫోజులతో చూపుతిప్పుకోనివ్వట్లేదుగా

First Published | Jun 3, 2023, 4:27 PM IST

అందాల యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)  వరుస ఫొటోషూట్లతో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా చీరకట్టులో మెరిసిన రంగమ్మత్త అందంతో చూపుతిప్పుకోనివ్వడం లేదు.
 

‘జబర్దస్త్’ కామెడీ షోతో అనసూయ భరద్వాజ్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల పాటు స్మాల్ స్క్రీన్ పై ఈ ముద్దుగుమ్మ సందడి చేసింది.

కేవలం యాంకర్ గానే కాకుండా అనసూయ తన అందంతోనూ కట్టిపడేసింది. ప్రతి ఎపిసోడ్ లో ఇంట్రో సాంగ్ కు అదిరిపోయేలా డాన్స్ చేసి అనతి కాలంలో స్టార్ యాంకర్ గా ఎదిగింది. తన అందంతోనూ కట్టిపడేసింది.


బుల్లితెరపై అనసూయ అందాల ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. తన బ్యూటీఫుల్ లుక్స్ తో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ను, ఆడియెన్స్ ను అలరించింది. ప్రస్తుతం ఈ షోకు దూరమైంది. దీంతో ఫ్యాన్స్ కాస్తా అప్సెట్ అవుతున్నారు. 
 

సినిమాల్లో వరుస పెట్టి అవకాశాలు అందుకోవడంతో అనసూయ బుల్లితెరకు దూరమైంది. కానీ తన అభిమానులను సోషల్ మీడియాతో ద్వారా పలకరిస్తూనే వస్తోంది. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. అదిరిపోయే ఫొటోషూట్లతోనూ ఫిదా చేస్తోంది.
 

తాజాగా అనసూయ మరిన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. చీరకట్టులో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో చూపుతిప్పుకోకుండా చేసింది. ముక్కు పుడక, బ్లాక్ బ్లౌజ్, వయెలెట్ కలర్ శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది.
 

చీరకట్టులో మయాజేసింది. ఒంపుసొంపుల్ని ప్రదర్శిస్తూ కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. మత్తెక్కించే ఫోజులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. మత్తు కళ్లు, చిలిపి చూపులతో మంత్రముగ్ధులను చేసింది.
 

ప్రస్తుతం ‘విమానం‘ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. జూన్ 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో యూనిట్ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ మూవీలో సముద్రఖని ప్రధాన పాత్రలో నటించారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 

ఈ సినిమా ప్రమోషన్ కోసం అనసూయ వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ‘సుమతి’ పాత్రలో నటించగా అదే వేషాదరణ కనిపించేలా చీర కట్టి మెరుపులు మెరిపిస్తోంది. అందచందాలతో అదరగొడుతోంది. మరోవైపు  ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Pushpa 2 The Rule లోనూ అనసూయ నటిస్తున్న విషయం తెలిసిందే. 

Latest Videos

click me!