నిఖిల్ సిద్దార్థ లైనప్ కు దిమ్మతిరగాల్సిందే.. ఐదు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ.. డిటేయిల్స్

First Published | Jun 3, 2023, 2:56 PM IST

యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhi Siddhartha)  ప్రస్తుతం ఐదు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోల స్థాయిలో యంగ్ హీరో నిఖిల్ సినిమాలను ప్రకటిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
 

యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థ ‘కార్తీకేయ 2’తో భారీ సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సౌత్ తో పాటు నార్త్ లోనూ మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ చిత్రంతో నిఖిల్ కు దేశ వ్యాప్తంగా క్రేజ్ పెరిగింది.
 

దీంతో నిఖిల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఈ క్రమంలో నిఖిల్ లైనప్ ఎవరూ ఊహించని విధంగా మారింది. ఏకంగా ఐదు ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘కార్తీకేయ2’,‘18 పేజెస్’ తర్వాత ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ Spy తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 


ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  కొత్త ప్రొడక్షన్ హౌజ్ లోనూ నిఖిల్ పాన్ ఇండియా సినిమా రూపుదిద్దుకుంటోంది. నిఖిల్ సిద్ధార్థ హీరోగా పేట్రియాటిక్ డ్రామాగా ‘ది ఇండియా హౌజ్’ అనే క్రేజీ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రం ఫస్ట్ లుక్, గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. వీ మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. 
 

ఇక బ్లాక్ బాస్టర్ సీక్వెల్ ‘కార్తీకేయ 2‘ తర్వాత ‘కార్తీకేయ 3’ కూడా రాబోతోంది. దర్శకుడు చందూ మొండేటి ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను ఓ బిగ్ స్టార్ తో తెరకెక్కించబోతున్నారు. దాని తర్వాత ఈ సీక్వెల్ ను డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఆ లోపు ఈ ప్రాజెక్ట్ లను కూడా నిఖిల్ పూర్తి చేయనున్నారు. ఏదేమైనా నిఖిల్ స్టార్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తుండటం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
 

మరోవైపు భారీ బడ్జెట్ తో నిఖిల్ 20వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘స్వయంబు’. హిస్టారికల్ వార్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. నిఖిల్ బర్త్ డే సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫేరోషియస్ లుక్ తో నిఖిల్ ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. పిక్సెల్ స్టూడియో బ్యానర్ పై భువన్, శ్రీకర్ లు నిర్మిస్తున్నారు. 
 

చివరిగా ‘శాకినీ డాకినీ’, ‘రావణసుర’ చిత్రాలకు దర్శకత్వం వహించిన సుధీర్ వర్మ (Sudheer Varma) డైరెక్షన్ లోనూ నిఖిల్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఇంకా చిత్రాన్ని అనౌన్స్ చేయలేదు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 
 

Latest Videos

click me!