Anasuya bharadwaj
అనసూయ కెరీర్ న్యూస్ రిపోర్టర్ గా మొదలైంది. జబర్దస్త్ షో ఆమె జీవితాన్ని మార్చేసింది. స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. దాంతో ఆమె నటిగా ఆఫర్స్ మొదలయ్యాయి. సిల్వర్ స్క్రీన్ పై బిజీ కావడంతో యాంకరింగ్ వదిలేసింది.
అనసూయ విలక్షణ పాత్రలు చేస్తుంది. రంగస్థలం లో భర్త లేని ఒంటరి మహిళ పాత్ర చేసింది. ఇక విమానం మూవీలో వేశ్య పాత్ర చేసింది. వేశ్య గా నటించిన అతికొద్ది మంది నటీమణుల జాబితాలో అనసూయ చేరింది. అనసూయ చావు కబురు చల్లగా చిత్రంలో ఐటెం సాంగ్ కూడా చేసింది.
కాగా హైదరాబాద్ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన రజాకార్ మూవీలో అనసూయ లోతైన సీరియస్ రోల్ చేశారు. ఈ క్రమంలో ఇకపై గ్లామరస్ రోల్స్ చేయరా అనే ప్రశ్న ఎదురైంది. రజాకార్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఈ ప్రశ్నకు ఆమె స్పందించారు. ఆసక్తికర సమాధానం చెప్పారు.
నేను మారలేదు. అయితే ఈ చిత్రం ద్వారా పరిణామం చెందాను. నేను ఎంటర్టైనర్ ని. నేను మారను. స్పెషల్ సాంగ్స్ ఇప్పుడు కూడా చేస్తాను. రజాకార్ మూవీలో పాత్రను నేను కనెక్ట్ అయి చేశాను. ఇది నిజంగా జరిగిన కథ.
Anasuya Bharadwaj
నాకోసం రాసిన పాత్ర ఎలాంటిదైనా చేస్తాను. కాబట్టి నేను అన్ని రకాల పాత్రలు, సాంగ్స్, గ్లామరస్ రోల్స్ చేయడానికి సిద్ధమని అన్నారు. అనసూయ ఇకపై గ్లామర్ రోల్స్ కి దూరం అవుతారా... అని అర్థం వచ్చేలా వేసిన ప్రశ్నకు అనసూయ ఇలా స్పందించారు.
గ్లామరస్ సాంగ్స్, బోల్డ్ రోల్స్ చేయడానికి ఎప్పుడూ సిద్దమే అని హింట్ ఇచ్చింది. అనసూయ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనసూయ నెక్స్ట్ పుష్ప 2లో సందడి చేయనుంది. అందులో ఆమె లేడీ విలన్ రోల్ చేస్తున్నారు. ఆగస్టు 15న పుష్ప 2 విడుదల అవుతుంది.
Anasuya Bharadwaj
మరోవైపు ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ. అనసూయ చేతుల మీదుగా పలు షాపింగ్ మాల్స్ ఓపెన్ అవుతున్నాయి. అందుకు అనసూయ లక్షలు వసూలు చేస్తుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది.