Brahmamudi
BrahmaMudi 14th February Episode: కనకం,మూర్తి టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కావ్య, రాజ్ వస్తారు. అల్లుడు గారు వచ్చారని కనకం హడావిడి చేస్తుంది. ముందే చెబితే టిఫన్ చేసేదాన్ని కదా అని కనకం అంటుంది. దానికి కావ్య.. నీకు టిఫిన్ చేసే అంత మంచి మనసు ఉన్నా,.. తినే మనసు ఇక్కడ ఎవరికీ లేదు అని వెటకారంగా మాట్లాడుతుంది. కనీసం టీ అయినా తాగమని కనకం అంటుంటే.. నాకు పని ఉంది వెళ్లాలి అని రాజ్ అంటాడు. అక్కడ కూడా కావ్య సెటైర్ వేస్తుంది. ఉండాలి అనుకునేవారు ఉండటానికి కారణాలు వెతుకుతారని.. వెళ్లాలి అనుకునేవారు ఏం చేసినా ఉండరు అని అంటుంది. కావ్య ఎందుకు అలా మాట్లాడుతుందో కనకం, మూర్తిలకు అర్థం కాదు. కావ్య కోపంగా లోపలికి వెళ్లిపోతుంది.
Brahmamudi
మా అమ్మాయి ఏమైనా గొడవ చేసిందా అని మూర్తి అడిగితే.. మీ అమ్మాయి గొడవ చేయకపోతే ఆశ్చర్యపోవాలి.. రోజూ అదే చేస్తుంది అని రాజ్ అంటాడు. దానికి అప్పూ.. మా అక్క గొడవ చేస్తుంది కానీ ఎదుటివాళ్లను బట్టి అలా చేస్తుంది అని చెబుతుంది. అప్పూ మాటలను పట్టించుకోవద్దని కనకం అంటే.. అక్క అలా ఉంటే.. చెల్లి ఇలానే ఉంటుంది లే అని రాజ్ అంటాడు. మా అమ్మాయి అలా ఎందుకు ఉంది అని మూర్తి అడిగితే.. నాకేం తెలుసు అని రాజ్ విసుక్కుంటాడు. భర్తగా మీకు ఆ మాత్రం బాధ్యత లేదా అని అప్పూ మళ్లీ దూరిపోతుంది. మూర్తి జాలిగా మా అమ్మాయి ఏదైనా తప్పు చేసిందా అని అడుగుతాడు. లేదు అని చెప్పి.. కావ్య కోసం కారు పంపిస్తాను అని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు.
Brahmamudi
అక్కడ ఏదో జరిగిందనే విషయం మూర్తి, కనకం లకు అనుమానం వస్తుంది. అదే విషయాన్ని కావ్యను అడుగుతారు. కావ్య ఏదోదో మాట్లాడుతూ ఉంటుంది. ఏమైందని అప్పూ పిలవగా.. కావ్య ఏడుస్తూ కనిపిస్తుంది. అంత కష్టం వచ్చిందా.. నువ్వు ఏడుస్తున్నావా అని కనకం అంటే.. మీ అల్లుడు గారు.. మరో అమ్మాయితో తిరుగుతున్నారు నాన్న అని కావ్య చెబుతుంది. మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని చెబుతుంది. మొదటిసారి తనకు అత్తారింట్లో ఒంటరి అయిపోయిన ఫీలింగ్ కలిగింది అని గుక్కపట్టి ఏడుస్తుంది. అత్తారింటికి వెళ్లలేక ఇక్కడికివచ్చాను అని కావ్య చెబుతుంది.
Brahmamudi
బావ అందరిలాంటి వాడిని కాదనుకున్నానని, బావను నిలదీశావా అని అప్పూ అడుగుతుంది. తనకు నమ్మకం లేదు అని కావ్య అంటుంది. అయితే.. అప్పూ మాత్రం తాను ఊరుకోనని, కచ్చితంగా బావను నిలదీస్తాను అని అప్పూ అంటుంది. అయితే తొందరపడొద్దని కనకం అంటుంది.కానీ అప్పూ ఊరుకోదు. నిలదీయాల్సిందే అని పట్టుపడుతుంది. కనకం మాత్రం తొందరపడొద్దని.. మెల్లగా మార్చుకోవాలని అంటుంది. అప్పూ అయితే.. ఇంకోసారి తప్పు చేయకుండా ఉండాలి అంటే.. కోర్టు లాగి, శిక్ష వేయాల్సిందే అని అంటుంది.
Brahmamudi
అప్పుడు కావ్య నిజం చెబుతుంది. రాజ్ నిజంగా ఎవరినీ ప్రేమించి, పెళ్లి చేసుకోవాలి అనుకోవడ లేదని..కేవలం నటిస్తున్నాడని చెబుతుంది. ఎందుకు అంటే.. ఆయన తనతో విడిపోవాలని అనుకుంటున్నారని , తనతో కలిసి ఉండాలని ఎప్పుడూ అనుకోలేదని, అవకాశం దొరికితే విడిపోవాలనే అనుకున్నారని, మా మధ్య పడింది బ్రహ్మముడి కాదని.. ఆయనకు విడిపోయే అవకాశం దొరికింది అని కావ్య చెబుతుంది. ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నావ్ అని కనకం అడుగుతుంది. అక్కడితో సీన్ కట్ చేస్తారు.
Brahmamudi
దుగ్గిరాల ఇంట్లో అందరూ కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కావ్య తప్ప...ఆఫీసుకు వెళ్లిన వారందరూ వస్తారు. అయితే.. ధాన్యలక్ష్మి కావ్య గురించి అడుగుతుంది. వెటకారంగా కావ్య గురించి మాట్లాడుతుంది. ఏం జరిగిందని రాజ్ అడిగితే.. కావ్యకు లాకర్ కీస్ ఇచ్చిందని.. దాంట్లో నుంచి కావ్య రూ.2లక్షలు తీసుకెళ్లిందని రుద్రాణి చెబుతుంది. మీరు ఆఫీసు నుంచి డబ్బులు తెమ్మని అడిగినప్పుడే ఈ విషయం బయటపడిందని ధాన్యలక్ష్మి చెబుతుంది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా డబ్బులు తీయడం దొంగతనం అవుతుంది అని ధాన్యలక్ష్మి అంటుంది.
Brahmamudi
కావ్యకు అంత అవసరం లేదని రాజ్ అంటాడు. అయితే రాజ్, ప్రకాశం, సుభాష్ లు కావ్యకు సపోర్ట్ చేస్తారు. ఏదో అవసరం ఉండి తీసుకుందేమో అని అంటారు. కానీ ధాన్యలక్ష్మి ఊరుకోదు. అసలు కావ్య ఎక్కడికి వెళ్లింది అని అడుగుతారు. తానే పుట్టింటి దగ్గర దింపి వచ్చాను అని రాజ్ చెబుతాడు. అయితే.. తన పుట్టింట్లో ఇవ్వడానికే వెళ్లింది అని ధాన్యలక్ష్మి అంటుంది. పుట్టింటికి దోచి పెడతాను అంటే ఇంట్లో ఎవరూ ఒప్పుకోరని.. అందుకే అలా తీసింది అని ధాన్యలక్ష్మి అంటుంది
Brahmamudi
అయితే.. రాజ్ పిన్నీ గట్టిగా అరుస్తాడు. కావ్యకు నిజంగా పుట్టింటికి డబ్బు ఇస్తే తప్పేంటి అని రాజ్ అడుగుతాడు. అవసరానికి వాడుకోమని మా బెడ్రూమ్ లోనే డబ్బులు చాలా పెట్టాను. ఇప్పటి వరకు అందులో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని.. ఈ రోజు తీసుకుంటే తప్పేంటి? నా భార్యకు దొంగతనం చేయాల్సిన అవసరం లేదని.. తనకు తీసుకునే హక్కు ఉందని , దొంగ అనే ముద్ర వేయాలా అని అని సీరియస్ అవుతాడు.
Brahmamudi
నువ్వు మాట్లాడవేంటి మమ్మీ అని అపర్ణను రాజ్ అడుగుతాడు. అయితే.. ధాన్యలక్ష్మి కే గడ్డిపెడుతుంది. కానీ ధాన్యలక్ష్మి మాత్రం ఊరుకోదు. ఎవరు ఏమన్నా.. చేసిన దొంగతనం బయటపడాల్సిందే అని ధాన్యలక్ష్మి అంటుంది. మధ్యలో రుద్రాణి మాత్రం.. ధాన్యలక్ష్మికి సపోర్ట్ చేస్తుంది. ఇంట్లో ఇంత మంది ఉండగా.. కావ్య స్వతంత్రంగా డబ్బు తీసుకోవడం, ఎవరికీ చెప్పకుండా తీసుకోవడం ఇంకా తప్పు అని అంటుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తే ఉమ్మడి కుటుంబానికి విలువ ఏది అని రుద్రాణి అంటుంది.
నా భార్యను దొంగ అనడం తప్పు అని రాజ్ మాత్రం ఊరుకోడు. కళావతిని అడిగే అధికారం ఈ ఇంట్లో ఎవరికీ లేదు అని చెప్పేసి రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాజ్ మాటలకు ధాన్యలక్ష్మి హర్ట్ అవుతుంది. వెంటనే సుభాష్ కూడా.. ధాన్యలక్ష్మికి సున్నితంగా గడ్డిపెడతాడు. అందరూ తననే తప్పు అనడంతో ధాన్యలక్ష్మి రగిలిపోతుంది.
Brahmamudi
సీన్ కట్ చేస్తే.. కావ్య బాధపడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఇప్పటి వరకు మీ మొగుడు ఒక్కడే మంచివాడు అనుకున్నానని.. అది కాదని తెలిసిందని అప్పూ అంటుంది. ప్రతిదానికీ చట్టాలు ఉన్నాయని.. ఆ ఇంటికి వెళ్లి నిలదీసి వస్తాను అని అప్పూ అంటే.. కనకం ఆపుతుంది. మనం ఇప్పుడు అలా అడిగితే రెచ్చగొట్టినట్లు అవుతుందని, అలా చేయవద్దని చెయ్యి జారితే మనం ఏమీ చెయ్యలేం అని కనకం అంటుంది.
ఆయన మనసులో తాను లేనప్పుడు ఎవరు మాత్రం ఏమీ చేయలేరని కావ్య ఏడుస్తుంది. స్వప్న అక్కను చూసి నేర్చుకోమ్మని అప్పూ సలహా ఇస్తుంది. కావ్య ఎప్పటిలాగానే రోటీన్ డైలాగులు కొడుతుంది. భర్త మనసులో ప్రేమను చట్టాలు, న్యాయాలు ఏమీ చేయలేవు అని చెబుతుంది. ఇంట్లో ఎంత మంది తనను సమర్థించినా ఆయన నిర్ణయం మారదని అర్థమైందని అంటుంది.
Brahmamudi
అయితే.. ఏం చేస్తావ్..? ఒంటరిగా జీవిస్తావా అని మూర్తి అంటాడు. ముందు కావ్య మనసులో ఏముందో చెప్పమని కనకం అంటుంది. దానికి కావ్య.. తాను ఆయన జీవితం నుంచి తప్పుకుంటాను అని చెబుతుంది. వెంటనే ఇందిరాదేవి ఎంట్రీ ఇస్తుంది. తప్పుకొని తప్పు నీ మీద వేసుకుంటావా అని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇక కమింగప్ లో ఇందిరాదేవి.. కావ్యకు మంచి ఐడియా ఇస్తుంది. ముల్లును ముల్లుతోనే తీయాలని.. కావ్యకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ప్లాన్ చేయమని సలహా ఇస్తుంది.