Rashmika Mandanna : రష్మిక మందన్న వాలెంటైన్స్ డే పోస్ట్.. స్పెషల్ ఏంటని అడుగుతున్న ఫ్యాన్స్!

First Published | Feb 14, 2024, 12:31 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)కు వాలెంటైన్స్ డే రోజు ఇంట్రెస్టింగా పోస్ట్ పెట్టింది. దానిపై ఫ్యాన్స్ క్రేజీగా స్పందిస్తున్నారు. స్పెషల్ ఏంటీ అంటూ అడిగేడుస్తున్నారు. 

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కన్నడ నుంచి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 

‘పుష్ప’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో దేశ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంది. తన నటనతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ తో ఈ ముద్దుగుమ్మ బిజీగా గడుపుతోంది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరించబోతోంది. 


ఇక రష్మిక మందన్నకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగా ఉందనే విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయాలనే కాకుండా వ్యక్తిగత విషయాలనూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

ఈ క్రమంలో ఈరోజు వాలెంటైన్స్ డే Valentines Day కావడంతో ప్రత్యేకమైన పోస్ట్ పెట్టింది. ‘మీమ్మల్ని కలిసి చాలా రోజులైంది.. ఇక మీ వాలెంటైన్స్ డే ప్లాన్స్ నాకు చెప్పండి.. అందరి కామెంట్లు తప్పకుండా చదువుతాను.’ అని పేర్కొంది. 

పని బిజీ వల్ల కాస్తా అలిసిపోయిందని.. తన అభిమానులతో ఎంతగానో మాట్లాడాలని వేచి చూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. అయితే వాలెంటైన్స్ డే ప్లాన్స్ గురించి ఫ్యాన్స్ ను అడగడంతో... అభిమానులు, నెటిజన్లు క్రేజీగా బదులిస్తున్నారు. 

ఇంతకీ మీ వాలెంటైన్స్ డే స్పెషల్ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరు విజయ్ దేవరకొండతో ఎంగేజ్ మెంట్ ఎప్పుడంటూ మళ్లీ అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక రష్మిక నెక్ట్స్ ‘పుష్ప : ది రూల్’తో అలరించబోతోంది.  

Latest Videos

click me!