బుల్లితెరకు గుడ్ బై చెప్పిన తర్వాత అనసూయ పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. చివరిగా ‘ఖిలాడీ’, ‘మైఖేల్’ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘ఫ్లాష్ బ్యాక్’, ‘పుష్ప : ది రూల్’లో నటిస్తూ బిజీగా ఉంది. అటు షూటింగ్స్ కు హాజరవుతూనే మరోవైపు ఓపెనింగ్ కార్యక్రమాలకు హాజరవుతూ సందడి చేస్తోంది.