టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) ప్రస్తుతం సక్సెస్ జోష్ లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ హిట్లను సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్ ఫుల్ ఖుషీ అవుతోంది. మొన్నటి వరకు భారీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా గడిపింది. టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సరసన నటించి మెప్పించింది. రీసెంట్ గా ఆ చిత్రాలు ‘వాల్తేరు వీరయ్య’.. ‘వీరసింహారెడ్డి’ విడుదలై బ్లాక్ బాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో శృతిహాసన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.