బ్లాక్ ఫ్రాక్ లో అనన్య పాండే మెరుపులు.. కిర్రాక్ ఫోజులతో ‘లైగర్’ బ్యూటీ కవ్వింపు

First Published | Oct 13, 2023, 11:13 AM IST

యంగ్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్ లోనే సందడి చేస్తోంది. మరోవైపు పలు ఈవెంట్లకూ హాజరవుతూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నయా లుక్ లో అదరగొట్టింది. 
 

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday ) ప్రస్తుతం హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. మరోవైపు పలు సినీ, ఫ్యాషన్ అవార్డుల వేడుకల్లోనూ పాల్గొంటూ సందడి చేస్తోంది. నయా లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ ముంబైలో నిర్వహించిన ఎల్లే బ్యూటీ అవార్డ్స్ 2023 వేడుకల్లో పాల్గొంది. ఈ సందర్భంగా బ్లాక్ లాంగ్ ఫ్రాక్ లో దర్శనమిచ్చింది. తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మెమోంటో, అవార్డును సొంతం చేసుకుంది. 


ఈవెంట్ కు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్, వాణీ కపూర్, శానన్య కపూర్, జాన్వీ కపూర్, మీరా కపూర్, విజయ్ వర్మ, బబుల్ ఖాన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. లేటెస్ట్ ఫ్యాషన్ తో ఆకట్టుకుంది. అనన్య తన అవుట్ ఫిట్ తో అదరగొట్టింది.

తాజాగా ఫొటోషూట్ కూడా చేసింది. స్లీవ్ లెస్ అండ్ స్ట్రిప్ లెస్ లాంగ్ బ్లాక్ ఫ్రాక్ లో అనన్య మెరిసిపోతోంది. ఈ సందర్భంగా ఫొటోలకు స్టన్నింగ్ గా ఫోజులిచ్చింది. తన బ్యూటీఫుల్ లుక్ తో, ఫ్యాషన్ సెన్స్ తో కట్టిపడేసింది. ఈ ముద్దుగుమ్మ అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

ఎద అందాలను విందు చేస్తూ అనన్య ఇచ్చిన ఫోజులకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అందంతో అదరగొడుతున్న బ్యూటీనికి తమ కామెంట్లతో ఆకాశానికి ఎత్తుతున్నారు. మరోవైపు ఫొటోలను లైక్స్, కామెంట్లతో మరింతగా వైరల్ చేస్తున్నారు. 

అనన్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. సినీ అప్డేట్స్ ను అందించడంతో పాటు తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ మరింత దగ్గరవుతోంది. మరోవైపు ఇలా బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది.

ఇప్పటికే అనన్యకు ఇన్ స్టాలో 24 మిలియన్ల ఫాలోవర్స్ ఉండటం విశేషం. ఈ సందర్భంగా అనన్య గ్లామర్ మెరుపులతో మరింతగా ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. చిన్న వయస్సులోనే ఈ స్థాయిలో ఫాలోయింగ్ దక్కించుకోవడం విశేషం. 

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’తో టాలీవుడ్ కూ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఆశించిన ఫలితం దక్కలేదు. ప్రస్తుతం హిందీలోనే సినిమాలు చేస్తోంది. ‘ఖో గయే హమ్ కహాన్’, ‘కంట్రోల్’, ‘శంకర’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 
 

Latest Videos

click me!