కొత్త ఇల్లు కొన్న అనన్యపాండే.. పండగవేళ గృహ ప్రవేశం చేసిన లైగర్ బ్యూటీ

First Published | Nov 11, 2023, 9:14 AM IST

‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే పండగవేళ కొత్త ఇంట్లో అడుగుపెట్టింది. ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించింది. కొత్త ఇంటిని చూపిస్తూ తాజాగా కొన్ని ఫొటోలను పంచుకుంది. 
 

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday)  దీపావళి వేడుకలను తన కొత్త ఇంట్లో జరుపుకుంటోంది. ముంబైలో ఓ ఇల్లు కొన్న ఈ ముద్దుగుమ్మ  ధంతేరస్ ఫెస్టివ్ సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహించింది. 
 

తను కొత్త ఇంట్లో అడుగుపెట్టిన సందర్భంగా వీడియోలు, ఫొటోలను అభిమానులతో పంచుకుంది. గుమ్మం వద్ద కొబ్బరికాయ కొట్టి.. ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. 
 


‘నా సొంత ఇల్లు. ఈ  ప్రారంభానికి. నాకు అందరి ప్రేమ, ఆశీర్వాదం కావాలి. అందరికీ థంతేరస్ శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు పండగ శుభాకాంక్షలు, కొత్త ఇంట్లోకి వచ్చినందునకు విషెస్ తెలుపుతున్నారు. 

ఇక పండగవేళ అనన్య పాండే బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. సంప్రదాయ దుస్తుల్లో వెలగిపోయింది. కొత్తఇల్లు కొన్న ఆనందానికి తోడు ట్రెడిషనల్ వేర్ లో మరింతగా మెరిసిపోతోంది. ఎల్లో లెహంగా, క్రీమ్ కలర్ టాప్ లో అందంగా దర్శనమిచ్చింది. 
 

ఇదిలా ఉంటే.. స్టార్ కిడ్ సారా అలీఖాన్ నిర్వహించిన దివాళీ బాష్ లో ఈ ముద్దుగుమ్మ కూడా పాల్గొంది. లేటేస్ట్ ఫ్యాషన్ వేర్ లో హాజరై ఆకట్టుకుంది. లెహంగా, వోణీలో అనన్య లుక్ కు అభిమానులే కాదు.. నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. 

అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్ లోనే వరుస చిత్రాలతో అలరిస్తోంది. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’ చిత్రం చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ పెద్దగా ఆడకపోవడంతో మళ్లీ హిందీ మూవీస్ పైనే ఫోకస్ పెట్టింది. 
 

Latest Videos

click me!