గుప్పెడంత మనసు: జగతిని కలిసేందుకు అనుపమ ప్లాన్స్, శైలేంద్రకు వసు ఝలక్..!

First Published | Nov 11, 2023, 7:55 AM IST

ఇక, తన తర్వాత బిజినెస్, కాలేజ్ అన్ని బాధ్యతలు నీకే అప్పగించాలని అనుకుంటున్నానని విశ్వనాథం చెబుతాడు. అనంతరం అనుపమ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Guppedantha Manasu


Guppedantha manasu: ఈరోజు ఎపిసోడ్ లో రిషి, వసుకోసం ఇయర్ రింగ్స్ తెచ్చిన విషయం తెలిసిందే. వాటిలో ఒకటి చేజారిపోతుంది. అయితే, అది రిషికి వెంటనే దొరికినా కూడా, కనపడట్లేదు అని వసుని ఆటపట్టిస్తూ ఉంటాడు.  నిజంగానే పోయింది అనుకొని వసు పాపం చాలా సేపు వెతుకుతూనే ఉంటుంది. దొరకలేదని బాధపడుతుంది.  వసు బాధపడటం చూడలేక వెంటనే రిషి ఆ జుంకాను వసూకి ఇచ్చేస్తాడు. అంటే, మీరు కావాలనే దాచి పెట్టారా? మీరు దొంగ సర్ అని వసు బుంగ మూతి పెడుతుంది. అయితే, రిషి మాత్రం ఇది తనకు ఒక జ్నాపకంగా ఉండాలని ఇలా చేశానని చెబుతాడు. తమ ప్రేమకు కాలం చాలా సార్లు పరీక్ష పెట్టిందని, అయితే, ఎన్ని పరీక్షలు ఎదురైనా తమ ప్రేమ మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది అని రిషి వసుతో అంటాడు. కాసేపు ఇద్దరూ ఇలానే మాట్లాడుకుంటారు. తమ బంధం చాలా బలమైందని, తాము మళ్లీ మునుపటిలాగా రిషిధారలం అయ్యామని, మళ్లీ తమ మధ్య దూరం వస్తే, తాను భరించలేను అని రిషి అంటాడు. ఆ తర్వాత వసుకి తాను తెచ్చిన జుంకాలను తొడుగుతాడు.

Guppedantha Manasu

ఆ జుంకాలు వసుకి చాలా అందంగా ఉన్నాయి. అవి పెట్టిన తర్వాత ఫోన్ కెమేరా ఆన్ చేసి వసూకి చూపిస్తాడు. అయితే, వసు సెల్ఫీ దిగుదామని అడుగుతుంది. ఆ తర్వాత ఇదంతా తనకు ఓ కళలాగా ఉందని వసు అనగా, మన జీవితంలో ఇక ఊహలు ఉండకూడదని, అన్నీ నిజాలే ఉండాలి అని రిషి అంటాడు. ముందున్నందంతా మనకు మంచి కాలమే అని చెబుతాడు. అయితే, దానికంటే ముందు తన తండ్రిని మామూలు మనిషిని చేయాలని, తన అమ్మని చంపిన శత్రువుని తాను పట్టుకోవాలి అని చెబుతాడు. మీరు మళ్లీ ఎండీగా బాధ్యతలు తీసుకుంటారా అని వసు ప్రశ్నించగా, నేను ఎప్పుడూ నీ ఎండీ నే వసుధారా అని రిషి అంటాడు. అవునా, కాదా నువ్వు చెప్పు వసుధారా అని రిషి అడగగా, వసు కాస్త సిగ్గుపడుతూ.. అవును మీరు నా డార్లింగ్ అంటుంది. దీంతో, రిషి, మరోసారి వసుని తన కళ్లలోకి చూస్తూ, మళ్లీ చెప్పమని అడుగుతాడు. అయితే, వసు కాస్త ఎక్కువగానే సిగ్గుపడుతుంది. పనులు ఉన్నాయి అంటూ తప్పించుకొని వెళ్లిపోతుంది.


ఇక, విశ్వనాథం తన గదిలో కూర్చొని పుస్తకం చదువుతూ ఉంటాడు. అక్కడికి అనుపమ వస్తుంది. డాడ్ అని పిలవగా, కూర్చోమ్మా అంటాడు. ఇక్కడ నీకు ఏదైనా ఇబ్బంది ఉందా అని అడగగా, తనకు ఏ ఇబ్బంది లేదని చెబుతుంది. ఇక, తాను ఓ ఫంక్షన్ చేయాలని అనుకుంటున్నానని తన తండ్రితో చెబుతుంది. ఏం ఫంక్షన్ అని విశ్వనాథం అడగగా, తన పాత స్నేహితులందరితో కలిసి గెట్ టూ గెదర్ లాంటిది ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నట్లు చెబుతుంది. దానికి తండ్రి పర్మిషన్ అడగగా, అతను ఒకే చెబుతాడు. ఇంత సడెన్ గా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడగగా, తాను తన ఫ్రెండ్స్ ని చాలా మందిని మిస్ అయ్యానని, దాని కోసమే ఇలా వారిని కలవాలని, వాళ్ల గురించిచ తెలుసుకోవాలని  అనుకుంటున్నానని చెబుతుంది. దానికి విశ్వనాథం ఒకే చెప్పి, అందరి కాంటాక్ట్స్ ఉన్నాయా అని అడుగుతాడు. ఈ విషయంలో ఎలాంటి అవసరం ఉన్నా, తాను సహాయం చేస్తానని చెబుతాడు. ఇక, తన తర్వాత బిజినెస్, కాలేజ్ అన్ని బాధ్యతలు నీకే అప్పగించాలని అనుకుంటున్నానని విశ్వనాథం చెబుతాడు. అనంతరం అనుపమ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Guppedantha Manasu

ఆ తర్వాత సీన్ లో రిషి,వసులు ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వసు ఒడిలో తల పెట్టుకొని పడుకొని  రిషి ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ‘వసుధార, నిన్ను ఒక విషయం అడగనా? నీకు, నేను ఏంజెల్ తెలుసుకదా? మా ఇద్దరిపై ఎప్పుడైనా అనుమానం కలిగిందా?’ అని అడుగుతాడు. వెంటనే వసు సీరియస్ అవుతుంది. ఏమైందో రిషికి అర్థం కాదు. ఇలాంటి ప్రశ్నలు తన మనసుని ముక్కులు  చేసేస్తాయని, ఇదే ప్రశ్న ఎంకెవరైనా అడిగి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేది అని వసు అంటుంది. మీరు నన్ను అడగాల్సిన ప్రశ్నలేనా అని, అసలు ఇలా ఎలా ఆలోచించారు? మీ మీద నాకు ప్రేమ తప్ప మరేమీ లేదని, అసలు మీ మీద నాకు అనుమానం వస్తే, ఈ వసుధార, వసుధారే కాదు అని ఆవేశంగా చెబుతూ ఉంటుంది. రిషి అమాయకంగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత వెనక నుంచి వసుని హగ్ చేసుకొని సారీ చెబుతాడు. వసు మాత్రం అలానే బుంగ మూతి పెట్టుకొని ఉంటుంది. నాకు సారీ వద్దు అంటే, మరి పూరీ కావాలా అని అడుగుతాడు. పోనీ, శారీ కొనిపెట్టనా అని అడుగుతాడు.  పది చీరలు కొనిపెడతానని, సారీ యాక్సెప్ట్ చేయమని అడుగుతాడు. అయినా, సరే వసు తనకు వద్దు అంటుంది.

Guppedantha Manasu

ఇక, రిషి బాగా ఆలోచించి, మంచం పైకి ఎక్కి వసుధారా సారీ అంటూ గట్టి, గట్టిగా అరుస్తూ ఉంటాడు. గతంలో, కాలేజీలో చదువుకునేటప్పుడు వసు కూడా రిషికి అలానే  క్షమాపణలు చెబుతుంది. దానిని రిషి రిపీట్ చేస్తాడు. అయితే, ఇక్కడ రిషి మంచంపైకి ఎక్కగా, వసు అప్పుడు ఏకంగా భవనంపైకి ఎక్కి అరుస్తుంది. ఇప్పుడు తాను కూడా అలానే భవనంపై కి ఎక్కి అరుస్తా అంటే,  వద్దు అని, సారీ యాక్సెప్ట్ చేస్తానని వసు అంటుంది. ఇంకోసారి మాత్రం ఇలాంటి ప్రశ్నలు అడగకండి అంటూ అని అడుగుతుంది. సరే అని  రిషి ఒప్పుకుంటాడు.

ఇక, తర్వాత రిషి తన పెదనాన్న ఫణీంద్రకు ఫోన్ చేసి మాట్లాడతాడు. తాను లేనప్పుడు డాడ్ ని వచ్చి కలిసినందుకు థ్యాంక్స్ చెబుతాడు. అయితే, పరిస్థితులు బాలేక ఇలా దూరంగా ఉంటున్నామని లేకపోతే, తన మనసు మొత్తం మీ దగ్గరే ఉంటుంది అని ఫణీంద్ర చెబుతాడు. మహేంద్ర ను తాను ఇంటికి రమ్మని పిలిచినా, రాలేదు అని అందుకే, తనను ఇబ్బంది పెట్టలేదని చెబుతాడు. అప్పుడుప్పుడు ఇలానే వచ్చి తన డాడ్ ని పలకరిస్తూ ఉండమని రిషి అడుగుతాడు. అయితే, మహేంద్ర తన తమ్ముడు అని , తనను చూసుకునే బాధ్యత తనపై ఉందని ఫణీంద్ర చెబుతాడు. ఆలోపే అక్కడికి శైలేంద్ర వస్తాడు.

రిషితో మాట్లాడతానని శైలేంద్ర అడగగా, ఇచ్చి అక్కడి నుంచి వెళతాడు. దీంతో, శైలేంద్ర.. మహేంద్ర గురించి నిజంగా తనకు కెరింగ్ ఉన్నట్లుగా నటిస్తూ రిషితో మాట్లాడతాడు. నిజం తెలియని రిషి తన అన్న నిజంగానే ప్రేమ చూపిస్తున్నాడని అనుకొని, అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెబుతూ ఉంటాడు. ఆతర్వాత మొన్న ఎక్కడికి వెళ్లారు అని ఆరా తీస్తాడు. రిషి నిజం చెప్పేలోపు వసు అక్కడికి వస్తుంది. తెలివిగా, ఫోన్ తాను తీసుకుంటుంది. రిషిని అక్కడి నుంచి పంపించేస్తుంది. 
 

ఫోన్ లో శైలేంద్రతో వసు మాట్లాడుతూ ఏం అడుగుతున్నారు రిషి సర్ ని అంటుంది. క్షేమ సమాచారాలు అడుగుతున్నాను అంటే, అది మీ క్యారెక్టర్ కి సూట్ అవ్వదని, మీ బుద్ది అంత మంచి బుద్ది కాదు అని గట్టిగానే కౌంటర్లు ఇస్తుంది. రిషితో మీరు ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నారో కూడా తనకు తెలుసు అని కౌంటర్ ఇస్తుంది. వసు మాటలకు శైలేంద్ర ఫేస్ మాడిపోతుంది. ఇక, ఈసారి ఇంటికి వచ్చినప్పుడు ధరణి మేడమ్ ని కూడా తీసుకురండి అని అడుగుతుంది. భార్యను ఎలా గౌరవించాలో ముందు తెలుసుకోండి అని సలహా ఇస్తుంది. అంతేకానీ, కాలేజీ జోలికి మాత్రం రావద్దు అంటూ గట్టిగా కౌంటర్ ఇస్తుంది. దీంతో,వెంటనే దేవయాని ఫోన్ అందుకొని, వసుధారపై మండిపడుతుంది. ఆమె కూడా వసు అంతే గట్టిగా కౌంటర్ ఇస్తుంది. అరవకండి, మీ ఆరోగ్యానికే మంచిది కాదు అని చెబుతుంది. నా కొడుకు  వ్యక్తిగత విషయాలు, భార్యతో ఎలా ఉండాలో నువ్వు నాకు చెప్పద్దు అని దేవయాణి మండిపడుతుంది. ధరణి,శైలేంద్ర కారణంగా బాధపడుతుందని, అందుకే తాను జోక్యం చేసుకుంటాను అని చెబుతుంది.గుప్పెడంత మనసు కొనసాగుతుంది.

Latest Videos

click me!