దీపావళి ట్రీట్.. హాఫ్ శారీలో శ్రీదేవి కూతుళ్లు ఎంత ముద్దుగా ఉన్నారో చూశారా? ఫొటోస్

First Published | Nov 11, 2023, 7:24 AM IST

హాఫ్ శారీలో బాలీవుడ్ అక్కా చెల్లెళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ కట్టిపడేశారు. ఫెస్టివల్ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో కట్టిపడేశారు. తాజాగా జాన్వీ పంచుకున్న ఈ క్యూట్ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్ (Janhvi Kapoor), ఖుషీ కపూర్ (Khushi Kapoor) బాలీవుడ్ లో సందడి  చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జాన్వీ వరుస చిత్రాలతో అలరిస్తోంది. 
 

ఇటు టాలీవుడ్ లోనూ ఎన్టీఆర్  సరసన ‘దేవర’లో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ముద్దుగుమ్మకు సౌత్ లో మంచి భవిష్యత్ ఉంటుందని, ఎంట్రీ గ్రాండ్ ఉండబోతుందనేది అర్థమవుతోంది.
 


ఇదిలా ఉంటే.. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులతో ఈ  ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. అభిమానులు ఖుషీ అవుతున్నారు. 
 

దీవాళి సందర్భంగా ఈ అక్కాచెల్లెళ్లు హాఫ్ శారీలో దర్శనమిచ్చారు. ఇంట్లో జరిగిన ధంతేరస్ ఫెస్టివల్ లో ఇలా పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో శ్రీదేవి కూతుర్లు ఇలా దర్శనమివ్వడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. 
 

లెహంగా వోణీలో జాన్వీ కపూర్ కంటే ఖుషీ కపూర్ మరింత అందంగా మెరుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అక్క కంటే చెల్లినే ఎక్కువ పొగుడుతున్నారు. మొత్తానికి వీరి ట్రెడిషనల్ లుక్ కు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. నిండు దుస్తుల్లో వారిని ఆకట్టుకుంటున్నారు. 
 

గతంలో శ్రీదేవి వారి సన్నిధిలో, తదితర హిందూ పండుగలకు ఈ అక్కాచెల్లెళ్లు ఇలా అందంగా దర్శనమిస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు  వైరల్ గా మారాయి. జాన్వీ  దేవరలో నటిస్తుండగా.. ఖుషీ కపూర్ ‘ది ఆర్చీస్’తో బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతోంది.  

Latest Videos

click me!