స్టార్ హీరోయిన్లకు షాక్ ఇచ్చిన అనన్య నాగళ్ళ, ఆదర్శంగా నిలిచిన తెలుగు తార.

First Published | Sep 5, 2024, 9:05 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో..ముఖ్యంగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. కాని చిన్న హీరోయిన్ అయినా.. అనన్య నాగళ్ల వాళ్లకు షాక్ ఇచ్చింది. హీరోయిన్ల జాతికే ఆదర్శంగా నిలిచింది. 

ఈక్రమంలో ప్రభాస్ 2 కోట్లు.. చిరంజీవి, రామ్ చరణ్ 2 కోట్లు.. అల్లు అర్జున్, ఎన్టీఆర్, బాలయ్య, మహేష్ బాబు, రెండు రాష్ట్రాలకు కోటి అంటే చెరి 50 లక్షలు విరాళంగా ప్రకటించారు. చిన్న హీరోలు అయిన సాయి ధరమ్ తేజ్, తో పాటు మరికొంత మంది చిన్న హీరోలు పది లక్షలు విరాళాలు ప్రకటించారు.

1000 రోజులు ఆడిన బాలయ్య ఏకైక సినిమా ఏదో తెలుసా..?
 

ఇక తాజాగా విజయవాడ , ఖమ్మం వదరదల కారణంగా ముంపుకు గురై లక్షలమంది నిరాశ్రయులయ్యారు.. ఈక్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అటు ఆంధ్రా తెలంగాణ ప్రభుత్వాలకు టాలీవుడ్ నుంచి భారీగా విరాళాలు అందాయి. స్టార్ హీరోలంతా తమ వందుగా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. 

రజనీకాంత్ కూలీ సినిమా కోసం నాగార్జున షాకింగ్ రెమ్యునరేషన్..?
 


పిల్మ్ స్టార్స్ సినిమాలకే పరిమితం అవ్వడంలేదు. బిజినెస్ చేస్తున్నారు.. సమాజ సేవ చేస్తున్నారు. విపత్తులు వచ్చినప్పుడు. అత్యవరసర పరిస్థితుల్లో స్పందిస్తూ.. తమ వంతు సాయం కూడా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వరదల టైమ్ లో స్టార్ హీరోలు లక్షలు కోట్లల్లో విరాళాలు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. 

ఈక్రమంలో హీరోయిన్లు మాత్రం ఏమాత్రం స్పందించలేదు. ఎవరు రూపాయి కూడా జారలేదు. టాలీవుడ్ ద్వారా.. తెలుగు ప్రేక్షకుల ద్వారా కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటూ... రకరకాల బిజినెస్ ల ద్వారా కూడా కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్లు ఎవరు కనీసం స్పందించలేదు. 
 

అయితే వారందరికి షాక్ ఇస్తూ.. అచ్చతెలుగు హీరోయిన్ చిన్న హీరోయిన్ అనన్య నాగళ్ల వరద బాధితులకు తన వంతు సాయం ప్రకటించింది. స్టార్ హీరోయిన్ కాకపోయినా..రెమ్యూనరేషన్ చాలా తక్కువ అయినా.. తన వంతుగా 5 లక్షల విరాళం వరద బాధితులకు ప్రకటించింది. 
 

మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్య.. ఇకపై గ్లామర్ రోల్స్ కూడా ట్రై చేసింది.  అనన్య స్వతహాగా తెలుగమ్మాయి కావడంతో  ప్రస్తుతం బాగా హైలెట్ అవుతోంది. 

కోట్లు సంపాదించే హీరోయిన్లు కనీసం స్పందన కూడా లేదు. కాని అనన్య లాంటి హీరోయిన్ల సంపాదన లక్షల్లో కూడా ఉండదు. అటువంటిది ఆమె ప్రజల బాధ చూడలేక.. తన దగ్గర ఉన్నంతలో.. తనకు చేయగలిగినంతలో 5 లక్షలు విరాళం ప్రకటించడం అందరిని ఆశ్చర్య పరిచింది. 

అంతే కాదు ఈ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ద్వారా  ఆస్తులు కూడబెట్టిన హీరోయిన్లు బోలెడు మంది ఉన్నారు. కాని వారు కనీసం వరదల మీద స్పందించలేదు. వీరంతా అనన్య ను చూసి అయినా నేర్చుకోవాలి అంటూ విమర్శిస్తున్నారు.  

Latest Videos

click me!