టాలీవుడ్ లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రేక్షకులకు పరిచయమైన నటి అనన్య నాగళ్ళ. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ క్రమంగా ప్రధాన పాత్రల్లో నటించే స్థాయికి చేరుకుంది. అనన్య నాగళ్ళ గ్లామర్ ఫొటోస్ యువతని బాగా ఆకర్షిస్తున్నాయి. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
DID YOU KNOW ?
వకీల్ సాబ్ లో మెప్పించిన అనన్య
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో అనన్య నాగళ్ళ దివ్య నాయక్ పాత్రలో నటించింది. ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.
27
సోషల్ మీడియాలో అనన్య జోరు
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనన్య ఇప్పుడు జోరు ఇంకా పెంచేసింది. తెరపై ఎక్కువగా సింపుల్ గా కనిపించే పాత్రల్లో నటించిన ఆమె, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం గ్లామరస్ షోతో అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
37
అనన్య ఫోటోలకు క్రేజీ రెస్పాన్స్
ఇటీవలి కాలంలో అనన్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తున్న వీడియోలు, ఫోటోలకు విపరీతమైన స్పందన అలభిస్తోంది. ప్రత్యేకంగా ఆమె తన ఫిట్నెస్ ని హైలైట్ చేస్తూ పోస్టు చేసిన ఫోటోలకు అభిమానుల నుంచి ఫైర్ ఎమోజీలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గ్లామర్ డోస్ పెంచుతూ అనన్య ఫోటో షూట్స్ చేస్తోంది. జీన్స్ ప్యాంట్ ధరించి అనన్య ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. తన ఫోటోలకు అనన్య క్యూటీ బాంబ్ అని క్యాప్షన్ ఇచ్చుకుంది.
గత సంవత్సరం అనన్య తంత్ర, పొట్టెల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వంటి సినిమాల్లో నటించింది. అలాగే, ఆమె గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్ కూడా అందుకుంది. అయితే, ప్రస్తుతం కొత్త సినిమా అవకాశాలు తగ్గడంతో, అనన్య తన దృష్టిని సోషల్ మీడియాపై పెట్టినట్లు తెలుస్తోంది.
57
సోషల్ మీడియాతో ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం
బాలీవుడ్, టాలీవుడ్ నటీమణులు చాలా మంది సోషల్ మీడియాలో తమ ఇమేజ్‌ను గ్లామర్ ఫొటోస్ తో పెంచుకున్నారు. అనన్య కూడా వారి బాటలోనే పయనిస్తోంది. అదే దిశలో తన డిజిటల్ ప్రెజెన్స్‌ను బలపరచుకోవడం కోసం ఆమె కృషి చేస్తోంది. ఈ క్రమంలో, గ్లామరస్ ఫోటోషూట్లతో పాటు అభిమానులతో నిరంతరం కనెక్ట్ అవుతూ తన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటోంది.
67
అనన్య ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు
ప్రస్తుతం అనన్య నాగళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో 1.9 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉంది. ఈ వేగం కొనసాగితే, త్వరలోనే ఆమె 2 మిలియన్ల మైలురాయిని చేరుకోనుందని అంచనా.
77
అనన్య చిత్రాలు
సినిమా రంగంలో అవకాశాలు కొంత మందగించినా, సోషల్ మీడియాలో అనన్య హవా కొనసాగుతోంది. మల్లేశం, వకీల్ సాబ్, శాకుంతలం లాంటి చిత్రాలతో అనన్య గుర్తింపు పొందింది.