వకీల్ సాబ్, శాకుంతలం, తంత్ర లాంటి చిత్రాలతో యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పుడిప్పుడే అనన్య నాగళ్ళకి ప్రధాన పాత్రల్లో అవకాశాలు వస్తున్నాయి. అనన్య నాగళ్ళ నటించిన లేటెస్ట్ మూవీ పొట్టెల్. అక్టోబర్ 25న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో అనన్య నాగళ్ళ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది.