
Ananya Nagalla: తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల నెమ్మదిగా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతుంది. ఆమె వరుసగా క్రేజీ మూవీ ఆఫర్లని దక్కించుకుంటుంది. కంటెంట్ ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ నటిగా నిరూపించుకుంటుంది. హీరోయిన్‌గా ఎదుగుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందట.
తెలుగు అమ్మాయి అయిన అనన్య నాగళ్ల సాఫ్ట్ వేర్ జాబ్ వదులుకుని సినిమాల్లోకి వచ్చింది. `షాదీ` అనే షార్ట్ ఫిల్మ్ తో ఆమె సినిమాల వైపు టర్న్ తీసుకుంది. ఈ క్రమంలో `మల్లేశం` చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో డీ గ్లామర్ లుక్‌లో అదరగొట్టింది. ప్రియదర్శి సరసన నటించి ఆకట్టుకుంది. ఈ మూవీతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది అనన్య నాగళ్ల.
ఆ తర్వాత అనన్య నాగళ్ల `ప్లే బాక్` అనే డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంలో మెరిసింది. ఇందులో ఆమె పాత్రకి మంచి పేరొచ్చింది. ఈ క్రమంలోనే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన `వకీల్ సాబ్`లో ఛాన్స్ వరించింది. ఇందులో ఇన్నోసెంట్ తెలంగాణ అమ్మాయిగా కనిపించి అలరించింది. ఆ తర్వాత అనన్య కెరీర్ బిగ్ టర్న్ తీసుకుంది. వెంటనే పెద్ద ఆఫర్లు వచ్చినా, చాలా సెలక్టీవ్‌గా వెళ్లింది అనన్య. కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రయారిటీ ఇస్తూ వస్తుంది.
ఆ మధ్య అనన్య `తంత్ర`, `పొట్టేల్`, `శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్` చిత్రాల్లో నటించింది. ఈ మూవీస్ థియేటర్ల కంటే ఓటీటీలో దుమ్ములేపుతున్నాయి. ముఖ్యంగా 'తంత్ర' హిందీ వెర్షన్ జియో హాట్ స్టార్ లో టాప్ 2 లో ట్రెండ్ అవుతూ ఉండగా.. 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అమెజాన్ ప్రైమ్ వీడియో లో దేశ వ్యాప్తంగా ఇప్పటికీ టాప్ 5 లో ట్రెండ్ అవుతుండటం విశేషం.
ప్రస్తుతం అనన్య కెరీర్ మరో బిగ్ టర్న్ తీసుకుంటుంది. ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఏకంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ చిత్రానికి రాకేష్ జగ్గి దర్శకత్వం వహిస్తుండగా, ఇమ్మత్ లడుమోర్ నిర్మిస్తున్నారు.
ఇందులో అనన్య ట్రైబల్ అమ్మాయిగా కనిపించబోతుందట. కంటెంట్ ప్రధానంగా రూపొందుతున్న చిత్రమిదని, ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. ఇది ఆమెకి బెస్ట్ బాలీవుడ్ ఎంట్రీగా ఉండబోతుందట.
మరోవైపు ఇటు తెలుగు, అటు బాలీవుడ్‌లోనూ అనన్య చిన్న బడ్జెట్ చిత్రాలకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఐదు, పది కోట్ల లోపు బడ్జెట్ చిత్రాల్లో హీరోయిన్‌గా అనన్య పేరుని అంతా పరిశీలిస్తున్నారు. దీంతో ఆమెకి వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయట. కానీ తను మాత్రం కంటెంట్‌కి, తన పాత్రకి ప్రయారిటీ ఇస్తూ వెళ్తుందని సమాచారం.
తాజాగా సోషల్ మీడియా అటెన్షన్ తనవైపు తిప్పుకుంది అనన్య. తన గ్లామర్ ఫోటోలు పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. వాయిలెట్ కలర్ శారీలో మెరిసిపోయింది. కెమెరాకి క్రేజీగా పోజులిస్తూ హోయలు పోయింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
read more: సినిమాల్లేకపోయినా కోట్లు సంపాదిస్తున్న ప్రశాంత్.. ఏంచేస్తున్నాడో తెలిస్తే మతిపోవాల్సిందే
also read: రష్మిక సస్పెన్స్ ని బహిర్గతం చేసిన విజయ్ దేవరకొండ.. ఈ దాగుడు మూతలకు తెరపడేది అప్పుడేనా?