Karthika Deepam: హిమకు గోరుముద్దలు తినిపించిన శౌర్య.. ఏకాకి అయిపోతావ్ స్వప్న అంటూ ఆనంద్ రావు ఫైర్!

Published : Apr 11, 2022, 08:57 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepa) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తోంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Karthika Deepam: హిమకు గోరుముద్దలు తినిపించిన శౌర్య.. ఏకాకి అయిపోతావ్ స్వప్న అంటూ ఆనంద్ రావు ఫైర్!

హిమ (Hima).. నీ చేయి పట్టుకుంటే నాకు ధైర్యం గా ఉంటుంది అని సౌర్య చేతిని పట్టుకుంటుంది. అంతేకాకుండా కౌగిలించుకుంటుంది కూడా.. కానీ హిమ ఇలా ఎందుకు చేస్తుందో సౌర్య కు ఏమీ అర్ధం కాదు. మరోవైపు సప్న (Swapna)  మీ మనవరాలు చేసిన పని వల్ల కార్తీక్, దీప చనిపోయారు అని వాళ్ళ తండ్రితో అంటుంది.
 

26

అదే క్రమంలో సప్న (Swapna) ఉన్నదాంట్లో ఆనందపడాలి నాన్న అని ఆనంద్ రావ్ తో చెబుతుంది. అంతేకాకుండా ఉదాహరణకు నా జీవితం చూడు ఎంత బావుందో అని చెబుతుంది. దాంతో ఆనందరావు (Anand Rao) నువ్వు నా వయసు కు వచ్చేసరికి ఏకాకివి  అయిపోతావ్ సప్న అని అంటాడు.
 

36

మరోవైపు ఇంద్రుడు (Indrudu) ఫ్యామిలీతో.. హిమ భోజనం చేయడానికి కూర్చుంటుంది. ఇక జ్వాలా నీకు ఏం కర్రీ అంటే ఇష్టం అని అడుగుతుంది. దాంతో నాకు దోసకాయ పచ్చడి అంటే ఇష్టమని హిమ (Hima) అంటుంది. ఆ మాటతో సౌర్య ఎంతో కోపం వ్యక్తం చేస్తుంది. అంతే కాకుండా నాకు నచ్చని వాళ్లకు ఆ పచ్చడి అంటే ఇష్టం అని చెబుతుంది.
 

46

ఆ తర్వాత జ్వాల (Jwala) నే స్వయంగా హిమ కు గోరుముద్దలు పెడుతుంది. దాంతో హిమ కంట కన్నీరు పెడుతుంది. వీళ్ళిద్దరిని అలా చూసిన ఇంద్రుడు దంపతులు వీళ్ళు అక్కచెల్లెళ్లు లా అనిపిస్తున్నారు కదా అని అనుకుంటారు. దాంతో జ్వాలా మరింత సీరియస్ అవుతుంది. ఆ క్రమంలో హిమ (Hima) కు పోరపోతుంది దగ్గరుండి జ్వాల నీళ్లు కూడా తాగిస్తుంది.
 

56

ఆ తర్వాత ఇంటికి వెళ్లిన హిమ.. సౌర్య (Sourya)  ఫోటోని చూసుకుంటూ మురిసిపోతోంది. అంతేకాకుండా  నిన్ను చూడగానే గట్టిగా కౌగిలించు కోవాలనిపించింది అని తెగ మురిసిపోతుంది. ఇక రేపటి భాగంలో హిమ (Hima)  నేను తింగరి అంటూ ఆనందంగా గంతులు వేస్తుంది.
 

66

అంతే కాకుండా వాళ్ళ నానమ్మ ను పట్టుకుని గట్టిగా హాగ్ చేసుకుంటుంది. ఆ క్రమంలో సౌందర్య (Soundarya) హిమ ఎందుకు ఇంత ఆనందంగా ఉంది అని ఆలోచిస్తుంది. ఇక నిరూపమ్ (Nirupam) తనని కొంచెం మార్చు జ్వాల నీలా తయారు చెయ్యవా అంటూ ఇద్దరి అక్క చెల్లెల్లా చేతులు కలుపుతాడు.

click me!

Recommended Stories