ఒకే రిసార్ట్ లో విజయ్ దేవరకొండ, రష్మిక.. తప్పేంటి అంటూ ఫోన్ లో ఫొటో చూపించిన ఆనంద్ దేవరకొండ  

First Published May 27, 2024, 2:54 PM IST

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బేబీ మూవీ ఆనంద్ దేవరకొండ కెరీర్ ని మలుపు తిప్పింది అని చెప్పొచ్చు.

Anand Devarakonda

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బేబీ మూవీ ఆనంద్ దేవరకొండ కెరీర్ ని మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. అప్పటి వరకు ఆనంద్ దేవరకొండ పై ట్రోలింగ్ జరిగింది. కానీ బేబీ చిత్రంలో యాక్టింగ్ తర్వాత ఆనంద్ దేవరకొండపై అందరిలో ఒపీనియన్ మారింది. 

Anand Devarakonda

ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం గంగం గణేశా. మే 31న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ఆనంద్ దేవరకొండ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రంలో జబర్దస్త్ ఇమ్మాన్యూల్ ఆనంద్ దేవరకొండ ఫ్రెండ్ పాత్రలో నటించాడు. వీళ్ళిద్దరూ కలసి ఫన్నీగా ఓ ఇంటర్వ్యూలో చేశారు.

 ఈ ఇంటర్వ్యూలో ఇమ్మాన్యూల్ అడిగిన ప్రశ్నలకు ఆనంద్ దేవరకొండ బోల్డ్ గా సమాధానం ఇచ్చాడు. ఇమ్మాన్యూల్ మాట్లాడుతూ.. మీ అన్న, ఓ ప్రముఖ స్టార్ హీరోయిన్ ఒకే రిసార్ట్ కి వెళ్లినట్లు నా దగ్గర ఫోటో ఉంది. దీనిపై మీ సమాధానం ఏంటి అని అడిగాడు.

 తప్పేముంది నాదగ్గర కూడా ఫోటో ఉంది అని చూపించాడు. అది కో ఇన్సిడెంట్ అని చెప్పాడు. ఒకే రిసార్ట్ కి ఎలా వెళ్లారు అని మళ్ళీ ఇమ్మాన్యూల్ అడిగితే.. బాగా దూరం కదా ఫ్లైట్ లో వెళ్లారు అని సమాధానం ఇచ్చారు. 

ఇమ్మాన్యూల్ అంతటితో ఆగలేదు.. వాళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తోంది అని అడిగాడు. దీనితో ఆనంద్ దేవరకొండ సీక్రెట్ గా ఇక్కడ చెప్పొచ్చా అని అడుగుతూ.. వాళ్ళిద్దరి మధ్య నెక్స్ట్ సినిమాకి స్క్రిప్ట్ డిస్కషన్ నడుస్తోంది అని తెలిపాడు. వీళ్లిద్దరి ఇంటర్వ్యూలో నవ్వులు పూయించే విధంగా ఉంది. 

విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య చాలా కాలంగా సంథింగ్ సంథింగ్ ఎఫైర్ సాగుతోంది అంటూ ప్రచారం జరుగుతోంది. తమపై వస్తున్న రూమర్స్ కి తగ్గట్లుగానే వీళ్ళిద్దరూ లీకులు ఇవ్వడం ప్రారంభించారు. అయితే తమ రిలేషన్ ని విజయ్ దేవరకొండ, రష్మిక అఫీషియల్ గా ప్రకటించలేదు. 

ఆనంద్ దేవరకొండ ఈ సారి క్రైమ్ కామెడీ చిత్రంతో రాబోతున్నాడు. గంగం గణేశా చిత్రం వినాయకుడి విగ్రహం చుట్టూ జరిగే క్రైమ్ కథగా తెరకెక్కింది. ఈ చిత్రంతో ఆనంద్ దేవరకొండ ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి. 

click me!