Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్లో చాలా ట్విస్టులు జరిగాయి. ప్రేమ ఎస్సై కోచింగ్ కు వెళ్లేందుకు సిద్ధమైపోతుంది. ఇక వల్లి ప్రేమని టార్గెట్ చేస్తుంది. విశ్వ అమూల్య ప్రేమలో పడతాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నేటి ఎపిసోడ్లో ఎలాగైనా ప్రేమను ఎస్సై కోచింగ్ కు పంపించాలనుకుంటాడు ధీరజ్. ఇందుకోసం తండ్రిని ఒప్పించేందుకు చిన్న డ్రామా ఆడతాడు. సాగర్ ను అడ్డుపెట్టుకొని రామరాజును ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు. వేదవతి ముందే సాగర్ తో ప్రేమను పోలీస్ కోచింగ్ లో జాయిన్ చేస్తానని అంటాడు. సాగర్ ‘ప్రేమ ట్యూషన్లు చెబితేనే ఒప్పుకోలేదు. ఇప్పుడు పోలీస్ కోచింగ్ కు పంపిస్తారా’ అంటూ వెటకారం చేస్తాడు. అప్పుడు వేదవతి రామరాజుతో ‘వాడలా మాట్లాడుతూ ఉంటే మీరు ఏమీ మాట్లాడరేంటి.. ప్రేమను కోచింగ్ కు పంపిస్తానని చెప్పండి’ అని అంటుంది. మొదట్లో రామరాజు ఒప్పుకోడు. కానీ ప్రేమ ‘మీరు వద్దంటే నేను పోలీస్ కాను’ అని చెబుతుంది. దాంతో రామరాజు ‘నీ కలను వద్దనడానికి నేనెవరినీ’ అని చెప్పి ఒప్పేసుకుంటాడు.
దీంతో ధీరజ్ ఆనందంగా సాగర్ దగ్గరకు వచ్చి నీ వల్లే ఇదంతా అయిందని ఎత్తుకొని గిర గిరా తిప్పుతాడు. ప్రేమను పోలీస్ ఆఫీసర్ చేసేందుకు నీ ఓవరాక్షన్ కూడా మంచి పని చేసింది అని అంటాడు ధీరజ్. అప్పుడు వేదవతి మీ నాన్న చాలా మంచోడురా అని చెబుతుంది. అప్పుడు సాగర్ మధ్యలో కల్పించుకొని ‘నేను కూడా మంచోడినే మీ వల్ల ఇలా మారాల్సి వచ్చింది’ అంటాడు. ఆ తరువాత ప్రేమ, నర్మద, వేదవతి, ధీరజ్ ఆనందంగా డ్యాన్సులు వేస్తారు. ఇదంతా వల్లి చూసి ఆ సంతోషాన్ని నాశనం చేయాలని ప్లాన్లు వేస్తుంది.
23
అమూల్య ప్రేమలో విశ్వ
ఇక్కడ నుంచి సీన్ విశ్వ దగ్గరికి మారుతుంది. అమూల్య కాలేజీకి వెళ్ళినప్పుడు కొంతమంది ఆమెను ఏడిపిస్తారు. అప్పుడు విశ్వ వచ్చి వారిని కొడతాడు. అమూల్య మాట్లాడుతూ ‘సింపతీ కోసం కొత్త డ్రామా స్టార్ట్ చేశావా?’ అని అడుగుతుంది. విశ్వ ‘నన్ను నమ్ము. వాళ్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని అంటాడు. అయినా అమూల్య నమ్మనని చెప్పి వెళ్ళిపోతుంది. తన స్నేహితులతో విశ్వ మాట్లాడుతూ ‘అమూల్య విలువ తెలుసుకున్నాను. తను నా జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటాడు. దీంతో విశ్వ నిజంగానే మారాడా? లేదా నిజం మారినట్టు నటిస్తున్నాడా? అన్నది భవిష్యత్తులో తెలియాలి.
33
పగతో రగిలిపోతున్న వల్లి
వల్లి పగతో రగిలిపోతూ పుట్టింట్లో కూర్చుంటుంది. ప్రేమను గట్టిగా దెబ్బ కొట్టాలని ఆ దెబ్బకు విలవిలలాడిపోవాలని అంటుంది. అంతేకాదు ప్రేమకు జరిగిన పెళ్లి గురించి కూడా అసలు విషయాన్ని భాగ్యానికి చెప్పేస్తుంది. కానీ కనిపెట్టాల్సిన సీక్రెట్లు ఉన్నాయని.. అవి కనిపెట్టేందుకు ప్లాన్లు కూడా వేస్తుంది. ప్రేమ కాపురాన్ని పూర్తి చేస్తానంటూ వల్లి పగ పట్టిన పాములా మారుతుంది. ఇక ధీరజ్ ఆనందంగా ప్రేమను ఎస్సై కోచింగ్ అకాడమీకి తీసుకెళ్తాడు. ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.