Prenuptial Agreement: ముగ్గురు పిల్లలతో హాయిగా జీవితం.. హీరోయిన్ కాపురం కుప్పకూలిపోవడానికి కారణం ఏంటి ?

Published : Jul 13, 2026, 10:20 PM IST

2010లో ఆస్ట్రియా వ్యాపారవేత్త పీటర్ బాగ్‌ను పెళ్లాడినప్పుడు సెలినా జీవితం పూలపాన్పులా కనిపించింది. ముగ్గురు కొడుకులతో ఆమె సంసారం హాయిగా సాగుతోందని అందరూ అనుకున్నారు. కానీ, ఆ అందమైన దాంపత్యం వెనుక ఆమె అనుభవించిన 'నరకం' ఏంటి? ఈ స్టోరీ చూడండి.

PREV
17
సెలినా జైట్లీ
బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ సెలినా జైట్లీ (Celina Jaitly) జీవితంలో రంగుల ప్రపంచమే కాదు, కన్నీటి సంద్రం కూడా ఉంది. బయటకు అందంగా కనిపించే సెలబ్రిటీల జీవితాల్లో ఎన్ని చేదు అనుభవాలు ఉంటాయో చెప్పడానికి సెలినా జీవితమే ఓ ఉదాహరణ. ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది.
27
ముగ్గురు కొడుకులతో హాయిగా జీవితం
2010లో ఆస్ట్రియా వ్యాపారవేత్త పీటర్ బాగ్‌ను పెళ్లాడినప్పుడు సెలినా జీవితం పూలపాన్పులా కనిపించింది. ముగ్గురు కొడుకులతో ఆమె సంసారం హాయిగా సాగుతోందని అందరూ అనుకున్నారు. కానీ, ఆ అందమైన దాంపత్యం వెనుక సెలినా 'నరకం' లాంటి అనుభవాలు ఎదుర్కొన్నారని ఇప్పుడు తెలిసింది. విడాకుల తర్వాత ఆమె పడిన ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఇప్పుడు బయటపడ్డాయి.
37
సుమారు రూ.20 కోట్ల విలువైన ఆస్తి
సెలినా చెప్పిన షాకింగ్ నిజాల్లో ముఖ్యమైనది ఆమె ఎదుర్కొన్న ఆర్థిక నష్టం. పెళ్లికి ముందు తను కష్టపడి సంపాదించిన సుమారు రూ.20 కోట్ల విలువైన ఆస్తిని ఈ విడాకుల గొడవలో కోల్పోవాల్సి వచ్చిందని ఆమె ఎమోషనల్ అయ్యారు. 'ప్రేమ, నమ్మకంతో కట్టుకున్న బంధం విడిపోయినప్పుడు, భావాల కన్నా డబ్బు, ఆస్తికే ఎక్కువ విలువ ఉంటుంది' అనే చేదు నిజాన్ని ఆమె తన అనుభవంతో చెప్పారు.
47
భర్త నుంచి విడాకుల నోటీసు
సెలినా జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణం వాళ్ల పెళ్లి వార్షికోత్సవం రోజునే ఎదురైంది. ఆ సంబరాల్లో ఉండగానే భర్త నుంచి విడాకుల నోటీసు వచ్చింది. ఆ లెటర్ జర్మన్ (ఆస్ట్రియన్ జర్మన్) భాషలో ఉండటంతో, దాన్ని చదివించుకోవడానికి తన చిన్న పిల్లల సహాయం తీసుకోవాల్సిన దయనీయ పరిస్థితి ఆమెకు ఎదురైంది. ఆ క్షణం తన జీవితంలో అత్యంత బాధాకరమైనదని సెలినా చెప్పుకొచ్చారు.
57
మహిళలకు ఒక ముఖ్యమైన సలహా
ఇప్పుడు తన వ్యక్తిగత బాధను అధిగమించిన సెలినా, ఈ తరం మహిళలకు ఒక ముఖ్యమైన సలహా ఇస్తున్నారు. 'పెళ్లికి ముందే ఆస్తి, హక్కుల గురించి 'ప్రీనప్' (Prenuptial Agreement) ఒప్పందం చేసుకోవడం చాలా ముఖ్యం' అని ఆమె గట్టిగా చెప్పారు. ప్రేమలో ఉన్నప్పుడు ఆస్తి గురించి మాట్లాడటం తప్పని అనుకోవద్దని, అది మీ భవిష్యత్తుకు రక్షణ కవచం లాంటిదని ఆమె పిలుపునిచ్చారు. పెళ్లికి ముందు ప్రీనప్ ఒప్పందం చేసుకోవడం మహిళల హక్కులను కాపాడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంతకీ ఈ ప్రీనప్ ఒప్పందం ఏంటి? ముందు చూడండి..
67
ప్రీనప్ ఒప్పందం
ప్రీనప్ ఒప్పందం (Prenuptial agreement) అంటే.. ఒకవేళ విడాకులు తీసుకుంటే ఆస్తులు, పొదుపు, పెట్టుబడులు, ఇతర ఆర్థిక విషయాలను ఎలా పంచుకోవాలో ముందే నిర్ణయించుకోవడం. విదేశాల్లో పెళ్లికి ముందు ఇలాంటి ఒప్పందాలు చాలా కామన్. కానీ, మన దేశంలో దీన్ని ఇంకా పెద్దగా పాటించడం లేదు. 'ఇలాంటి చట్టపరమైన విషయాల గురించి మహిళలు తెలుసుకోవాలి, అవసరమైతే లీగల్ సలహా తీసుకోవాలి' అని సెలినా జైట్లీ సూచించారు. నటి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
77
సోషల్ మీడియాలో పెద్ద చర్చ
మొత్తం మీద, సెలినా జైట్లీ చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. 'ఆస్తి హక్కులు, పిల్లల సంరక్షణ విషయంలో మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికి సెలినా జీవితంలోని ఈ చేదు అనుభవాలే సాక్ష్యం' అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
Read more Photos on
click me!

Recommended Stories