సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అసలు నిజం ఇదే?

బుల్లితెర పై  ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో యాంకర్ ప్రదీప్ తో పాటు  సుడిగాలి సుధీర్ కూడా ఉన్నాడు. స్మాల్ స్క్రీన్ పై పాపులర్ అయిన వీళ్లలో సుడిగాలి సుధీర్ ఇంత వరకూ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా?  

Pradeep Machiraju- Sudigali Sudheer

బుల్లితెరపై పరిచయం అక్కర్లేని పేరు సుడిగాలి సుధీర్.  మెజీషియన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, జబర్ధస్త్ లో కమెడియన్ గా ఎదిగి, బుల్లితెరపై స్టార్ హీరోగా ఎదిగాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఓ రేంజ్ లో పాపులారిటీ సాధించాడు. కమెడీతో పాటు హీరోయిజం కూడా చూపిస్తూ తన మార్క్ టాలెంట్ తో ఎదిగాడు. సుధీర్ కు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ, బుల్లితెరపై స్టార్ డమ్ రావడంతో.. వెండితెరపై తన అదృష్టాన్ని చాలా సార్లు పరీక్షించుకున్నాడు సుధీర్. హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. కాని సిల్వర్ స్క్రీన్ పై ఓ మోస్తరు హీరోగా కూడా నిలవడలేకపోయాడు. 

Also Read: స్టార్ సింగర్లను మించిపోయిన హీరోయిన్, ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడిందంటే?
 

Sudigali Sudheer

దాంతో ఇప్పుడు మళ్లీ హోస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు సుధీర్. సినిమాలు చేస్తూనే హోస్ట్ గా కంటీన్యూ అవుతున్నాడు. ఇక కెరీర్లో చాలా ఎత్తుపల్లాలు చూసిన సుధీర్.. బాగా సంపాదించి సెటిల్ అయ్యాడు కాని.. ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉండిపోయాడు. ఈ విషయంలో చాలా సార్లు ఆయనకు ప్రశ్నలు ఎదురయినా తప్పించుకుంటూ వచ్చాడు. జబర్థస్త్  లో యాంకర్ రష్మితో సుధీర్ ఎపిసోడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆల్ మోస్ట్ వీరిద్దరు పెళ్లి చేసుకున్నారనే అంతా అనుకున్నారు. అంతలా వీరి గురించి హైప్ ఇచ్చారు. 

Also Read: 40 కోట్లు బడ్జెట్ పెడితే 40 వేలు కూడా రాలేదు, దేశంలోనే చెత్త రికార్డ్ ఈ సినిమాదే?


వీళ్ళిద్దరి కాంబినేషనర్ లో వచ్చిన పెళ్లి ఎపిసోడ్స్ అయితే అన్నీ ఇన్ని కావు. రష్మికూడా ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోకపోవడంతో వీరిపై ఇప్పటికీ అందరికి అనుమానాలు ఉన్నాయి. కాని వీళ్లు మాత్రం మేము మంచి స్నేహితులమే కాని.. మా ఇద్దరి మధ్య ప్రేమాలాంటిది లేదు అన్నారు. కాని ఇద్దరు ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించినా వీరి వ్వవహారం మాత్రం అందరికి అనుమానం వచ్చేలానే ఉంటుంది. సరే ఇదంతా ఓకే కాని.. సుధీర్ ఇంత వరకూ పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం ఏంటి? 

ఈ విషయంలో మరో జబర్ధస్త్ కమెడియన్ ధనరాజ్ భార్య ఓ సందర్భంలో వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి  ధనరాజ్ సతీమణి శిరీష మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో  వైరల్ అయ్యాయి. ఆమె ఏమన్నారంటే సుధీర్ తో మా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. నన్ను వదినా అని ప్రేమగా పిలుస్తుంటాడు.

నాకు తెలిసినంత వరకూ సుధీర్ పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేడు. చాలామంది మమ్మల్ని కూడా అడుగుతుంటారు. టీవీలో చూసి సుధీర్  పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అని అడుగుతూ ఉంటారు. కాని మాకు తెలిసి పెళ్ళి మీద అతనికి ఇంట్రెస్ట్ లేదు. 

దానికి ఒక కారణం ఉంది. పెళ్లి అంటే కచ్చితంగా ఒకే దగ్గర స్టక్ అయిపోవాల్సి ఉంటుంది. ఏది చేయాలన్నా సాధ్యం కాదు అనేది అతని ఆలోచన. ఒక దగ్గర ఉండటం సుధీర్ కి ఇష్టం లేదు. భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటాడేమో నాకు తెలియదు కానీ, ప్రస్తుతం అతని ఫోకస్ మొత్తం కెరీర్ పైనే ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక సుధీర్ విషయానికి వస్తే చాలా కాలం తర్వాత ఆయన ఈటీవీ లోకి రీ ఎంట్రీ ఇచ్చి ‘ఫ్యామిలీ స్టార్స్’ అనే ప్రోగ్రాం చేస్తున్నాడు. అంతే కాకుండా ఆయన చేతిలో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే సినిమా కూడా ఉంది.

Latest Videos

click me!